Bigg Boss Telugu 9: ఆదివారం బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమేషన్ అనంతరం వచ్చే మండే మాత్రం మంటలు చెలరేగుతాయనే విషయం తెలియంది కాదు. ఆదివారం ఇంటి నుంచి ఒక హౌస్‌మేట్ ఎలిమినేట్ అయితే.. మళ్లీ వచ్చే ఆదివారం వెళ్లేందుకు సోమవారం నామినేషన్ మొదలవుతోంది. ఇంటి సభ్యులకు మండే అంటే చాలు దడ పుడుతుంది. ఇక ఈ షో ఎండింగ్‌కు వచ్చే కొద్ది మరింత ఆసక్తికరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ (Nominations) చూస్తే, అసలు సిసలైన ఆట మొదలైందని ప్రతి ఒక్కరూ అంటారు. ముఖ్యంగా భరణి (Bharani), డిమోన్, ఇమ్ముల ఫైర్ ఈ వారం నామినేషన్స్‌లో కనిపించింది. భరణి ఇప్పటి వరకు చూపించని ఫైర్ ఈ వారం ప్రదర్శించారు. మండే నామినేషన్స్‌లో ఫైర్ చూసిన వాళ్లంతా.. ఈ భరణి కదా మాకు కావాల్సింది అని అంటున్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ మండే షో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే హౌస్‌లోని ప్రేమ పక్షులు రీతూ, డిమోన్‌ల మధ్య కూడా ఆసక్తికరమైన ఫైట్ నడుస్తోంది. ఎప్పుడూ లేని రీతూని డిమోన్ నామినేట్ చేయడంతో.. హౌస్‌లో తగలడిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది వీక్షకులకు. ఇక మండేకి సంబంధించి వచ్చిన ప్రోమోలను ఒక్కసారి గమనిస్తే..
రీతూ, పవన్‌ల బాండింగ్ హైలెట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 71వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 71) నామినేషన్స్ హీట్ నడుస్తోంది. కెప్టెన్ తనూజ (Tanuja)కు ‘ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనే హక్కు.. ఇంటి కెప్టెన్ చేతుల్లో ఉంటుంది’ అని బిగ్ బాస్ చెబుతూ.. కొన్ని టోకెన్స్‌ను తనూజకు ఇచ్చారు. అందులో ఒకరికి ఒక్కరినే నామినేట్ చేసే అధికారం ఉంటే, ఇంకొందరికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంది. ఎవరెవరికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వాలనేది తనూజకే వదిలేశారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇచ్చిన టోకెన్స్‌ను తనూజ పంచేసింది. ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెబుతూ.. వారి ఎదురుగా ఉన్న కుండను బద్దలు కొట్టాలి. వరసగా కుండలు బద్దలవుతున్నాయి. ఇమ్ము వచ్చి రీతూని నామినేట్ చేశాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం నడుస్తుంది. అతనికి రెండో అవకాశం కూడా తనూజ ఇచ్చింది. రెండో అవకాశంలో భరణిని ఇమ్ము నామినేట్ చేశాడు. ఇమ్ము చెప్పిన రీజన్‌కు భరణి శాటిస్‌ఫై అవలేదు. డిమోన్ వచ్చి రీతూ(Rithu)ని నామినేట్ చేశాడు. ‘నువ్వు అరవడం వల్ల.. నా తప్పు లేకపోయినా, నాదే తప్పు అన్నట్లుగా బయటకు వెళుతుంది’ అని రీజన్ చెప్పాడు. వారిద్దరి మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Also Read- Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!
భరణి, సుమన్ శెట్టి ఫైర్
‘నామినేషన్ బ్లాస్ట్’ అంటూ వచ్చిన రెండో ప్రోమోలో.. భరణి వచ్చేసి ఇమ్ముని నామినేట్ చేసి, ఎందుకు చేసిందీ వివరణ ఇచ్చాడు. కళ్యాణ్ వచ్చేసి డిమోన్‌ని, రీతూ వచ్చేసి దివ్యను నామినేట్ చేసి వాదించుకుంటున్నారు. రీతూని దివ్య నామినేట్ చేసి, తన వివరణ తను ఇచ్చింది. రీతూ మాత్రం వాదిస్తుంది. సీరియస్‌గా వచ్చి రీతూ కుండని దివ్య పగలకొట్టింది. ఎగైన్ రీతూని భరణి నామినేట్ చేశాడు. రీతూ వచ్చేసి సంజనను నామినేట్ చేసింది. ‘మైండ్ లెస్’ అనే టాపిక్‌పై వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సుమన్ శెట్టి తన వంతు రాగానే.. తను ఆడిన టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్న కళ్యాణ్ చేసిన తప్పును చెబుతూ, అతనిని నామినేట్ చేశాడు. కళ్యాణ్ వేలు చూపిస్తూ.. మాట్లాడుతున్నాడు. అందుకు సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు. మొత్తంగా అయితే, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అనే రేంజ్‌లో నామినేషన్స్ జరిగాయని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా ఎవరెవరు నామినేట్ అయ్యారనేది.. ఎపిసోడ్‌లో తెలుస్తుంది. కెప్టెన్ తనూజ మినహా అందరూ అయినట్లే కనిపిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
