Dhandoraa Teaser: నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ (Shivaji), నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోన్న ఈ చిత్ర టీజర్ (Dhandoraa Teaser)ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..
చస్తే ఇడీకే తేవాలె
‘సుజీ ఒక్క ముద్దు పెట్టుకుంటానే.. ప్లీజే’ అని ప్రియుడు ప్రియురాలిని వేడుకుంటున్న డైలాగ్‌లో ఈ టీజర్ మొదలైంది. ‘ఏం చేద్దామనుకుంటున్నావ్.. పిచ్చిపిచ్చిగా ఉందా’ అని అమ్మాయి వార్నింగ్ ఇస్తుంటే.. ‘బలవంతం ఏం లేదు’ అని అబ్బాయి అంటే.. ‘నువ్ చెయ్యరా బలవంతం ఈ రోజు నేను చూస్తాను’ అంటూ అమ్మాయి వీరలెవల్లో అబ్బాయిని ఆడేసుకుంటుంది. సర్పంచ్ అయినప్పటి నుంచి ఆగుతల్లేదు అంటూ.. నవదీప్ (Navdeep) పాత్రను పరిచయం చేశారు. కూలింగ్ గ్లాసెస్ వేసుకుని పంచకట్టులో నడిచి వస్తూ.. అందరూ నమస్కారం పెడుతుంటే తను కూడా వారికి విష్ చేస్తూ దర్పంగా ఉండే పాత్రలో నవదీప్ కనిపిస్తున్నారు. ఆ వెంటనే మరో పాత్రను పరిచయం చేశారు. గ్రూపులో కూర్చుని.. ‘నువ్ హైదరాబాద్ పో.. అమెరికా పో.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో శివాజీ ఎంట్రీ అదిరిందనే చెప్పుకోవాలి.
Also Read- Vasudeva Sutham Song: మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ నుంచి ‘ఏమైపోతుందో’ సాంగ్ రిలీజ్..
వాళ్లు డబ్బులిస్తారు.. నేను సర్వీస్ చేస్తున్నా..
‘మేం తంతే లేవనోళ్లు.. అయినొచ్చి గొకితే లేస్తరని ఎందివయా ఇది’ అని వెటకారంగా ప్రెసిడెంట్ నవదీప్ చెప్పే డైలాగ్‌తో పాటు కొన్ని పాత్రలను పరిచయం చేస్తూ.. చాయ్ తాగనేకి శవం దగ్గరకు వస్తారా? అంటూ పల్లెటూర్లలో ఉండే భాషతో కొన్ని కామెడీ సీన్స్ నడిచాయి. పల్లెటూర్లలో ఉండేవారితో ప్రెసిడెంట్‌కు ఎలాంటి ప్రాబ్లమ్ ఉంటుందో.. నవదీప్ డైలాగ్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చారు. వెంటనే కారులో నందు.. తన భార్య కూతుర్లను మ్యాచింగ్ పర్సస్‌పై తిడుతుంటాడు. ఇక అసలు పాత్రధారి బిందు మాధవి (Bindu Madhavi) పోషించిన వేశ్య పాత్రను పరిచయం చేశారు. ‘ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్లు నాకు డబ్బులిస్తున్నారు.. నేను వాళ్లకి సర్వీస్ చేస్తున్నా’ అంటూ శివాజీతో చెప్పిన డైలాగ్‌తో పాత్రలన్నింటినీ పరిచయం చేసిన దర్శకుడు.. మరోసారి పాత్రలన్నింటినీ వరుసగా స్పీడ్ మోడ్‌లో పరిచయం చేశారు.
Also Read- Varanasi Video Response: ‘వారణాసి’ వీడియోపై ప్రేక్షకుల అభిమానానికి మహేష్, రాజమౌళి ఏం అన్నారంటే?
నాలుగు పుస్తకాలు చదివితే లోకం తెలిసిపోతుందా..
ఇక సినిమా మెయిన్ కథాంశంలోకి వచ్చి ఓ ఎమోషనల్ కోణాన్ని ఆవిష్కరించారు. శవాన్ని మోస్తూ తీసుకెళుతుండగా.. ఓ పిల్లాడు ‘అన్నా.. మా అవ్వను ఇంత దూరం ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నిస్తాడు’. ‘నాలుగు పుస్తకాలు చదివి.. లోకమంతా తెలిసినట్లు మాట్లాడొద్దు.. నీకు తెలియని లోకం ఇంకోటుందిరా’ అంటూ శివాజీ చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాలో ఇంకేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందనేది తెలుస్తోంది. పుట్టుక, చావు మధ్య మనిషి ఎదుర్కొనే సంఘర్షణ, పరిస్థితులు, భావోద్వేగాలు గురించి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందనేది ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. మొదటి నుంచి ‘దండోరా’ సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో రూపుదిద్దుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతూనే వస్తున్నారు. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టీజర్‌తో దర్శకుడు బలమైన అంశాన్ని చెప్పాలనకుంటున్నాడనే విషయమైతే అర్థమవుతోంది. ఈ టీజర్‌తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేశారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
