Samantha and Raj Nidimoru: బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో స్టార్ హీరోయిన్ సమంత పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింేద. తాజాగా రాజ్ తో చాలా సన్నిహితంగా ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ భుజాలపై రాజ్ చేతులు వేసి.. అమెరికా వీధుల్లో తిరుగుతున్న నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్ నిడిమోరు భార్య మరోసారి ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
ఆమె ఏమన్నారంటే?
సమంతతో తన భర్త రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న రూమర్లపై అతడి భార్య శ్యామాలి పరోక్షంగా స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ లో వరుస స్టోరీస్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. మతం ఏదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దని, అదే మన జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని ఆమె రాసుకొచ్చారు. అలాగే ‘లైఫ్స్ గ్రేట్ గోల్డెన్ రూల్’ అనే క్యాప్షన్ తో వివిత మతాలకు సంబంధించిన సూక్తులను పంచుకున్నారు. ఆ తర్వాత భగవద్గీతలో కృష్ణుడు, అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ కూడా ఆమె పోస్ట్ చేశారు. గెలుపోటముల కంటే ముఖ్యమైంది ఏంటీ అని అర్జునుడు ప్రశ్నించగా.. ధర్మం అంటూ కృష్ణుడు సమాధానం ఇచ్చినట్లుగా ఆమె మరో స్టోరీ పెట్టారు. రాజ్ – సామ్ డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో శ్యామాలి పెట్టిన ఇన్ స్టా స్టోరీస్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
కొన్ని రోజులుగా ఇంతే
సామ్ – రాజ్ మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటి నుంచి శ్యామాలి తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. ఇటీవల నమ్మకం, కర్మ సిద్ధాంతం గురించి ఆమె పేర్కొన్నారు. నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేమని అన్నారు. కాలం అన్నింటినీ భయపెడుతుందన్న ఆమె.. కర్మ వాటికి సమాధానం చెబుతుందని నెట్టింట రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే రాజ్ – శ్యామాలి విడిపోతున్నట్లు బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిద్దరూ కలిసి జీవించడం లేదన్న ప్రచారమూ జరుగుతోంది. దీనికి తోడు శ్యామాలి 2023లో చివరిసారిగా రాజ్ తో ఉన్న ఫొటోను పంచుకున్నారు. దీంతో శ్యామాలికి విడాకులు ఇచ్చి సమంతను రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్స్ ఊపందుకున్నాయి.
Also Read: Gold Rates (10-07-2025): గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్ ?
రాజ్ – సామ్ పరిచయం
రాజ్-డీకే సంయుక్తంగా రూపొందించిన సూపర్ హిట్ వెబ్ సిరీసులు ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించారు. ఆ ప్రాజెక్ట్‌ల కోసం పని చేస్తున్న సమయంలోనే రాజ్‌తో సామ్ కు పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశారు. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు.. జంటగా ఉన్న ఫొటోలు బయటకు వస్తున్నప్పటికీ ఇరువురు తమ రిలేషన్ పై అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా అమెరికాలోని మిచాగావ్ లో జరిగిన ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా’ (TANA) 2025 ఎడిషన్ కు సామ్, రాజ్ జంటగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం అమెరికా వీధుల్లో వీరిద్దరు క్లోజ్ గా తిరుగుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.