Rage Of Kaantha: దక్షిణాది సినీప్రేక్షకుల మన్ననలు పొందిన వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తున్న నూతన చిత్రం ‘కాంత’ (Kaantha). ఈ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1950 మద్రాస్ భారతీయ సినీ చరిత్రలో గోల్డెన్ ఏజ్‌గా నిలిచిన ఆ దశాబ్దం.. ఈ చిత్రానికి ప్రధాన బ్యాక్‌డ్రాప్‌గా నిలుస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, సినీప్రపంచానికి అంకితమైన ఒక భావోద్వేగాత్మక ట్రిబ్యూట్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటిస్తుండగా.. విలక్షణ నటుడు సముద్రఖని (Samuthirakani) కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘రేజ్ ఆఫ్ కాంత’ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?
ట్రెండింగ్‌లో ‘రేజ్ ఆఫ్ కాంత’
దుల్కర్ సొంత బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి (Rana Daggubati) ఆధ్వర్యంలోని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా వచ్చిన ‘రేజ్ ఆఫ్ కాంత’ (Rage Of Kaantha) రాప్ ఆంథమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. సంగీత దర్శకుడు ఝాను చంతర్ ఈ ట్రాక్‌ని స్వరపరిచారు. పాతకాలపు మ్యూజిక్ ఎలిమెంట్స్‌ని ఆధునిక రాప్ బీట్స్, శక్తివంతమైన గిటార్ సౌండ్స్‌తో మేళవిస్తూ, పూర్తిగా ఎక్స్‌పెరిమెంటల్ స్టైల్‌లో ఈ పాట రూపొందించబడింది.
గోల్డెన్ ఏజ్ డ్రామా
‘రేజ్ ఆఫ్ కాంత’ పాటలో ఉన్న ఎనర్జీ, సినిమాకు చెందిన ఇంటెన్సిటీని ముందుగానే చూపిస్తోందనేలా కామెంట్స్ పడుతున్నాయి. వింటేజ్ మ్యూజిక్ ఫీలింగ్‌తో పాటు ఆగ్రహం, ప్యాషన్, రెబెల్ స్పిరిట్ కలగలిపిన ఈ ట్రాక్ దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రలోని మానసిక స్థితిని ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోలో కూడా రెట్రో కలర్ టోన్, సినిమాటిక్ షాట్స్ అద్భుతంగా తెరకెక్కి ఉన్నాయని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. 1950లలోని మద్రాస్ సినిమా పరిశ్రమ, స్టూడియో సంస్కృతి, నటుల పోరాటం, ప్రేమ, ఆవేశం వంటి అంశాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై టీమ్ అంతా ఎంతో నమ్మకంగా ఉంది. ప్రతి అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. దుల్కర్ సల్మాన్ అభిమానులు, సినీ ప్రేమికులు ఈ గోల్డెన్ ఏజ్ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
