Pvr inox vs Consumer Court: సాధారణంగా మల్టీప్లెక్సుల్లో మనం సినిమాకు వెళ్ళినప్పుడు యాడ్స్ తెగ చికాకు తెప్పిస్తాయి. ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం యాడ్స్ ప్లే కావడం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంటాయి. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునే సమయంలో పోర్టల్ లో ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి సినిమాకు వెళ్తే.. 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు యాడ్స్ ప్లే అవుతుంటాయి. పోర్టల్ చూపించిన టైమ్ కు వెళ్లేందుకు ప్రేక్షకులు తొందరపడటమే కాకుండా విలువైన సమయాన్ని కోల్పోతుంటారు. దీని కారణంగా కొన్ని పనులు, అత్యవసర పనులు వాయిదా పడటమే కాకుండా క్యాన్సిల్ కూడా అవుతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్ పేస్ చేసిన ఓ వ్యక్తి ఈ తీరుపై మండిపడి కన్స్యూమర్ కమిషన్ ను ఆశ్రయించాడు. ఈ కేసును పరిశీలించిన
కమిషన్ ఎలాంటి తీర్పు వెల్లడించింది? ఇంతకీ ఏం జరిగిందంటే..
2023లో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటలకు పీవీఆర్ ఐనాక్స్‌లో(PVR Inox) ఓ సినిమా టికెట్ బుక్ చేసుకున్నాడు. 4 గంటలకు థియేటర్ యాజమాన్య షో స్టార్ట్ చేయకుండా 30 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, సినిమాల ట్రైలర్లు ప్రసారం చేసింది. దీంతో సాయంత్రం 6 గంటలకు ముగియాల్సిన సినిమా 6.30 నిమిషాలకు ముగిసింది. దీంతో ఆ వ్యక్తి వ్యక్తిగత పనులు క్యాన్సిల్ అయ్యాయి. తీవ్ర అసహనానికి గురైన ఆ వ్యక్తి బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షో తో పాటు పివిఆర్ ఐనాక్స్‌పై కన్స్యూమర్ కమిషన్(Consumer Court) లో ఫిర్యాదు దాఖలు చేశాడు. తాజాగా కన్స్యూమర్ కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
తాజాగా కన్స్యూమర్ కమిషన్ తీర్పు వెల్లడిస్తూ.. ” కస్టమర్ సమయాన్ని డబ్బుగా పగణించాలి. వెంటనే ఆ వ్యక్తికి రూ. 65,000 నష్ట పరిహారాన్ని పివిఆర్ ఐనాక్స్‌చెల్లించాలి. అలాగే రూ. లక్షా
జరిమానా కట్టాలని” ఆదేశించింది. ఈ తప్పుకు బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయినా బుక్ మై షోకు(Book My Show) ఎలాంటి సంబంధం లేదు కాబట్టి శిక్షార్హులు అని వెల్లడించింది. దీంతో దేశంలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్‌చైన్ అయినా పివిఆర్ ఐనాక్స్ కు ఇలాంటి దెబ్బ తగలడంతో ఫ్యూచర్ లో మల్టీప్లెక్సులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి టికెట్ల ధరల కంటే యాడ్స్, స్నాక్స్ ద్వారానే మల్టీప్లెక్సులు ఎక్కువ సంపదను పోగు చేసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సీన్ వాడేశా!