Purushaha: భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియెన్స్‌కి బోర్ కొట్టవని, తాజాగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankar Vara Prasada Garu) మరోసారి నిరూపించింది. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ.. రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పురుష:’ (Purushaha). బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan Bathula) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా టీజర్‌తో అందరినీ తెగ నవ్వించేసి, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మేకర్స్ స్టార్ చేశారు.
Also Read- Nara Rohith Wedding Video: ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ.. నారా రోహిత్, సిరి వెడ్డింగ్ వీడియో చూశారా?
క్యాచీ లిరిక్స్, ఆస్కార్ విజేత గాత్రం
అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ అన్నట్టుగా.. మగాడి మీద జాలి కలిగేలా, మగాడి పరిస్థితిపై సానుభూతి పెరిగేలా ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు’ అంటూ సాగే పాట (Jaali Padedhevvadu Lyrical Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి (MM Keeravani) ఆలపించడం విశేషం. ఆయన గాత్రంలో ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. ఇక శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. అనంత శ్రీరామ్ అయితే సినిమా కథను వివరించేలా, కథనాన్ని అందరికీ ముందే చెప్పినట్టుగా క్యాచీ లిరిక్స్‌తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ లిరిక్స్ భార్యాభర్తల మధ్య బంధాన్ని వివరించడమే కాకుండా, మగాడికి సపోర్ట్‌గా నిలిచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. మంచి కామెంట్స్‌ని అందుకుంటోంది.

Also Read- Nithiin36: నితిన్‌కు ఈ దర్శకుడైనా హిట్ ఇస్తాడా? నితిన్36 ఎవరితో అంటే?
త్వరలోనే రిలీజ్ డేట్..
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఒక్కో పోస్టర్ ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ పరంగా అంతా పోస్టర్సే ఇప్పటి వరకు ఈ సినిమాను వార్తలలో నిలుపుతూ వచ్చాయి. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే రిలీజ్ డేట్‌ను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన తారాగణం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

