PuriSethupathi: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఒక వైపు ప్రీ ప్రొడక్షన్ పనులతో, ఆర్టిస్ట్‌ల ఎంపిక జరుగుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో ఎంపికైన స్టార్ నటీనటులను ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కామ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అదేంటి? పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూ.. పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించాలి కదా? ఇంత కామ్‌గా, ఎవరికీ తెలియకుండా ముగించేశారేంటి? అంటూ, ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. నిజమే.. ఈ మధ్య నార్మల్, మినిమమ్ బడ్జెట్ సినిమాల ప్రారంభోత్సవం కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. కానీ.. పూరి, ఛార్మీ మాత్రం సింపుల్‌గా పూజా కార్యక్రమాలు ముగించేసి, జూలై ఫస్ట్ వీక్ నుంచి సెట్స్‌పైకి వెళ్లిపోతున్నారు. ఈ విషయం స్వయంగా మేకర్సే ప్రకటించారు.
Also Read- Bayya sunny yadav: సన్నీ యాదవ్ పెట్టిన వీడియోలో నిజం లేదంటున్న నా అన్వేష్ ఊరి ప్రజలు
విజయ్ సేతుపతితో సినిమా చేస్తూ.. గ్రాండ్‌గా ప్రారంభించకుండా.. సింపుల్‌గా ముగించేయడానికి కారణం ఇదేనంటూ కొన్ని వార్తలు ప్రత్యక్షమవుతున్నాయి. ‘లైగర్’ తర్వాత పూరిలో చాలా మార్పు వచ్చిందని, ఆ సినిమా ఇచ్చిన షాక్‌తో సాధ్యమైనంతగా సినిమా ఖర్చులు తగ్గించాలని పూరి, ఛార్మీ ఫిక్స్ అయ్యారని.. అందుకే ఇలా చేశారనేలా టాక్ నడుస్తుంది. ఏమో.. ఇందులో కూడా నిజం ఉండి ఉండవచ్చు. ఇదిలా ఉంటే.. పూరి, ఛార్మీలతో పాటు ఈ సినిమా నిర్మాణంలో మరొకరు కూడా యాడ్ అయ్యారు. JB మోషన్ పిక్చర్స్ JB నారాయణ్ రావు కొండ్రోల్లా ఈ సినిమా నిర్మాణంలో పూరీ, ఛార్మీలతో కొలాబరేట్ అయ్యారు. పూరి కనెక్ట్స్‌తో JB మోషన్ పిక్చర్స్ కొలాబరేషన్ ఈ మూవీ గ్రాండియర్‌ని మరింతగా పెంచుతోందని చిత్ర బృందం భావిస్తోంది.
Also Read- Shefali Jariwala Death: నటి మృతిపై ప్రియాంక చోప్రా షాకింగ్ రియాక్షన్.. చాలా చిన్నదంటూ!
ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ పూరి జగన్నాథ్ చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది తనకు తాడో పేడో తేల్చేసే సినిమా కావడంతో మరీ ముఖ్యంగా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారని టాక్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్, నటీనటులని ఎంపిక చేసిన పూరి.. జూలై ఫస్ట్ వీక్‌లో షూట్ స్టార్ట్ చేసి.. శరవేగంగా పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. విజయ్ సేతుపతి సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్ వంటి వారు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో రూపుదిద్దుకుంటోన్న ఈ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఎక్జయిటింగ్ అప్‌డేట్స్‌ని త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
The much anticipated journey of #PuriSethupathi begins with a divine pooja ceremony✨
Makkalselvan @VijaySethuOffl and Dashing Director #PuriJagannadh are gearing up to deliver a memorable film ❤🔥
Regular shoot begins in July 1st week 💥
Produced by Puri Jagannadh, Charmme… pic.twitter.com/530ZVX6FXZ
— Puri Connects (@PuriConnects) June 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు