Shefali Jariwala Death: బాలీవుడ్ నటి షెఫాలి జరీవాలా (Shefali Jariwala Death).. శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ విషయాన్ని ఆమె భర్త పరాగ్ త్యాగి (Parag Thyagi) ప్రపంచానికి తెలియజేశారు. ముంబయిలోని కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం అనంతరం.. శనివారం సాయంత్ర ఓషివారా శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. షెఫాలీ అంత్యక్రియల సమయంలో పరాగ్ కన్నీరుమున్నీరు అవుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. అయితే 42 ఏళ్లకే షెఫాలి మరణించడంపై సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. షెఫాలీ మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక ఏమన్నారంటే!
బాలీవుడ్ నటి షెఫాలి జరీవాలా మరణంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన స్టేటస్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షెఫాలి మరణవార్త విని తాను ఎంతగానో షాక్ అయినట్లు ఆమె తెలిపారు. ఆమె వయసు చాలా చిన్నదని పేర్కొన్నారు. ఆమె భర్త పరాగ్, అతడి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ప్రముఖుల బావోద్వేగం
శనివారం సాయంత్రం ఓషివారా శ్మశానవాటికలో షెఫాలి అంత్యక్రియలు నిర్వహించగా.. ఆమెను కడసారి చూసుకునేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు నివాసం వద్ద ఆమె పార్థివదేహాన్ని ఉంచగా.. సెలబ్రిటీలు వచ్చి కన్నీటి నివాళులు అర్పించారు. గాయని సునిధి చౌహాన్.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నటులు పరాస్ ఛబ్రా, హిందూస్థానీ భావు, షెహ్నాజ్ గిల్, వికాస్ గుప్తా సైతం నివాసం వద్ద కనిపించారు. మరోవైపు నటి అకస్మిక మరణంపై అంబోలి పోలీసులు రెండు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Bayya sunny yadav: సన్నీ యాదవ్ పెట్టిన వీడియోలో నిజం లేదంటున్న నా అన్వేష్ ఊరి ప్రజలు
పోస్ట్ మార్టం.. వీడియోలో రికార్డ్
ఇదిలా ఉంటే షెఫాలి పోస్ట్ మార్టం (Shefali Postmartam Report)ను.. కూపర్ ఆస్పత్రిలో నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియను వీడియోలో రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మెుత్తం ఐదుగురితో కూడిన వైద్యుల బృందం.. పోస్ట్ మార్టం నివేదికను తయారు చేస్తున్నట్లు అంబోలి పోలీసులు తెలిపారు. మంగళవారం రిపోర్ట్ వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు షెఫాలి మెడికల్ హిస్టరీ (Medical History) గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. గత 8 ఏళ్లల్లో ఆమె ఏ వైద్యులను సంప్రాదించారు? వారు ఆమెకు ఏ మందులు ఇచ్చారు? వైద్యులను సంప్రదించకుండా షెఫాలి స్వయంగా మందులు ఏమైనా తీసుకున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.