poola chokka ( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Poola Chokka: పోలీస్ స్టేషన్‌కు పూలచొక్కా నవీన్.. ఎందుకంటే?

Poola Chokka: యూ ట్యూబ్‌లో పూలచొక్కా పేరుతో అందరికీ సుపరిచితమైన పూలచొక్కా నవీన్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూలచొక్కా స్టేషన్ కు ఎందుకు వెళ్లాడు?. ఇటీవల ‘వర్జిన్ బాయ్స్’ నిర్మాత ఇచ్చిన కంప్టెంట్ వల్లనే పూలచొక్కా స్టేషన్‌కు వెళ్లారా? అది కాకుండా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అంతకు ముందు ఏం జరిగింది అంటే.. ‘వర్జిన్ బాయ్స్’ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు నిర్మాత రాజా దారపునేని (Raja Darapuneni) తెలుగు సినిమా సమీక్షకుడైన పూల చొక్కా నవీన్‌పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read also- Vijay Devarakonda: తీవ్రమైన అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరిన విజయ్ దేవరకొండ..

ఓ యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను నిర్మించిన సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ పూల చొక్కా నవీన్‌పై మండి పడ్డారు. ‘వర్జిన్ బాయ్స్’ (Virgin Boys) సినిమా పాజిటివ్‌ రివ్యూ ఇవ్వడానికి పూల చొక్కా నవీన్ తన నుంచి 40 వేల రూపాయలు డిమాండ్ చేశాడని నిర్మాత అన్నారు. ఇష్టం వచ్చినట్లు సినిమాలపై రివ్యూలు చేసే వారిని ఊరుకోమన్నారు. ఇలాంటి వారిని పోషించడం వల్ల నిర్మాతలు నాశనమైపోతున్నారని అన్నారు. చిన్న సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. రానున్న పెద్ద సినిమాల గురించి ఇలాంటి వారి ప్రచారం చాలా ప్రభావం చూపిస్తుందన్నారు. పూలచొక్కాగా బాగా పాపులర్ అయిన నవీన్. కొత్తగా విడుదలైన సినిమాలపై తనకు ఉన్న యూట్యూబ్ చానల్లో రివ్యూలు ఇస్తుంటారు. అందులో ‘వర్జిన్ బాయ్స్’ సినిమాకు 0.5 టమాటాలు అనగా రేటింగ్ ఇవ్వడంతో నిర్మాత ఆవేదనకు గురై పూలచొక్కా నవీన్‌పై కేసు పెట్టారు.

Read also- Sir Madam Trailer: బాబోయ్ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది? ఏ భార్యభర్తలకు ఇలాంటి కష్టం రాకూడదు!

ఈ విషయంపై పూలచొక్కా నవీన్ స్పందించారు. ‘వర్జిన్ బాయ్స్’ సినిమా విషయంలో మూవీ టీం తనను సంప్రదించిందని అయితే ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరగా కొంత రెమ్యూనరేషన్ అడిగానన్నారు. దాని తర్వాత మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తర్వాత తాను కూడా ఆ విషయాన్ని వదిలేశానన్నారు. జరిగింది ఇదైతే నిర్మాత మార్చి చెబుతున్నారని అన్నారు. ఈ సినిమా రివ్యూ చేయడానికి తాను ఎలాంటి మనీ డిమాండు చేయలేదన్నారు. దీని గురించి నిర్మాతపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని అయితే తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని అన్నారు. ‘వర్జిన్ బాయ్స్’ సినిమాలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు ఈ సినిమాకు రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించగా.. కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం దయానంద్ చూసుకున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫర్‌గా వెంకట ప్రసాద్ తన కెమెరా పనితనాన్ని చూపించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్