Vijay Devarakonda: హాస్పిటల్ లో చేరిన విజయ్.. షాక్ లో ఫ్యాన్స్
vijay ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Vijay Devarakonda: తీవ్రమైన అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరిన విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో అని పిలిపించుకునేది ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే. ఈ హీరో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా అతని ఆరోగ్యం గురించి ఆందోళనకర వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా విజయ్‌కు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, విజయ్‌కు డెంగ్యూ జ్వరం సోకినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: Sir Madam Trailer: బాబోయ్ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది? ఏ భార్యభర్తలకు ఇలాంటి కష్టం రాకూడదు!

అలాగే జూలై 20 వరకు అక్కడే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వార్త తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో విజయ్ ఆరోగ్యం గురించి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంకొందరు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే, విజయ్ టీమ్ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు, దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Also Read:  Anupama Parameswaran: ‘పరదా’ సినిమా చిన్నదైనా.. చెప్పాలనుకున్న కంటెంట్ చాలా పెద్దది

ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ నటించిన రాబోయే చిత్రం కింగ్‌డమ్ జూలై 31న విడుదల కానుంది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్‌కు ఇప్పటివరకు పెద్ద విజయం రాలేదు. దీంతో విజయ్ ఆశలన్నీ కింగ్‌డమ్ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో విజయ్ కి  ఆరోగ్య సమస్య ఎదురవడం అభిమానులను మరింత కలవరపరిచింది. సినిమా రిలీజ్ కు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే  ఉండగా, మా హీరో  త్వరగా కోలుకుని, కింగ్‌డమ్ ప్రమోషన్స్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం