Mythri Distribution vs Prasads Multiplex
ఎంటర్‌టైన్మెంట్

Prasads Multiplex: పర్సంటేజ్ విషయంలో తగ్గేదే..లే!

Prasads Multiplex: హైదరాబాద్ నగరంలో కొత్త సినిమా ఏది విడుదలైనా అందరికీ గుర్తు వచ్చేది ప్రసాద్స్ మల్టీప్లెక్స్. ఎక్కువ మంది ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. అది పండుగ కానీ, ఏదైనా మంచి సందర్భం కానీ.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే. అది కూడా ట్యాంక్ బండ్‌కి దగ్గరగా ఉండటంతో.. అక్కడ విహరించిన అనంతరం మూవీస్ చూస్తుంటారు. ఇక టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ అనుబంధ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్, ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి మధ్య ఈ మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ నుంచి మొదలైన ఈ గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన మూవీ విషయంలోనూ వారి మధ్య ఉన్న గొడవ కారణంగా ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఆ మూవీ పడలేదని తెలుస్తుంది.

Also Read- Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

‘లవ్ టుడే’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్, తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్’ అనే చిత్రంలో నటించారు. ఈనెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రదర్శించడం లేదు. బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే.. తమిళ వెర్షన్ షోలు మాత్రం వేస్తున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్.. ఇద్దరూ ఓ ఒప్పందానికి రాకపోవడంతో తెలుగు వెర్షన్ వేయడం లేదని తెలుస్తోంది.

Return of the Dragon
Return of the Dragon

సాధారణంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ ఓనర్లు ఒక్క టికెట్ నుంచి 60 శాతం తీసుకుని, మిగతా 40 శాతం డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతకు అమౌంట్ ఇస్తారు. వారు అన్ని సినిమాలకు అలాగే చేస్తుంటారని టాక్ ఉంది. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ టైమ్‌లో దీనిపై వివాదం నెలకొంది. ‘పుష్ప 2’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నైజాం అంతటా ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలోనే మైత్రీ డిస్ట్రిబ్యూషన్, ప్రసాద్ మల్టీప్లెక్స్ మధ్య టికెట్‌పై తీసుకునే పర్సంటేజ్ విషయంలో బేధాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు మైత్రీ డిస్ట్రిబ్యూషన్ టికెట్‌పై ప్రస్తుతం ఉన్న దాని కన్నా ఎక్కువ డిమాండ్ చేయడంతో, అందుకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం ఒప్పుకోలేదు. తమ పర్సంటేజ్ తగ్గించే ప్రసక్తే లేదని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ తెగేసి చెప్పింది. ఇదే విషయం ఇండస్ట్రీ అంతటా తెలిసేలా చేసింది. దీంతో ‘పుష్ప-2’ మూవీ షోస్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో వేయలేదు. ఇక ఆ తర్వాత ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో వేసిన షోలు అన్ని కూడా అదే పర్సంటేజ్‌కు వేశారు. పర్సంటేజ్ విషయంలో తగ్గేదే లే.. అనేలా సంకేతాలు పంపడంతో మైత్రీ కాకుండా మిగతా వారంతా అందుకు ఓకే చెబుతూ షోలు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
People Media Factory: చిక్కుల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. గట్టెక్కేనా?

Trivikram Srinivas: సినిమాలకు దూరం.. పవన్‌తోనే పయనం

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?