Dude Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Dude Movie: ప్రదీప్ రంగనాథన్, మమిత బైజుల ‘డ్యూడ్’ ఫస్ట్ గేర్ చూశారా?

Dude Movie: ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), మమిత బైజు (Mamitha Baiju) ఈ రెండు పేర్లు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఒకరు హీరోగా దూసుకెళుతుంటే, ఇంకొకరు హీరోయిన్‌గా గ్లామర్‌తో మంటలు రేపుతున్నారు. అలాంటి ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తే.. కుర్రకారుకు పండగే అని చెప్పుకోవచ్చు. ఆ అవకాశాన్ని కల్పిస్తుంది ఎవరో కాదు.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్యూడ్‌’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచడమే కాకుండా.. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని వేచి చూసేలా చేస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మరో అప్డేట్‌ని వదిలారు. అదేంటంటే..

Also Read- Sridevi Vijaykumar: మీరేంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న.. శ్రీదేవి విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

ఫస్ట్ సింగిల్ – బూమ్ బూమ్‌
ఇప్పటి వరకు పోస్టర్లతోనే పిచ్చెక్కించిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్’ (Boom Boom Lyrical Song) అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. యూత్ మెచ్చేలా, యూత్‌కి నచ్చేలా ఈ సాంగ్‌ని పిక్చరైజ్ చేశారు. ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ సింగిల్ విషయానికి వస్తే.. కోలీవుడ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ ఈ పాటను స్వరపరచడంతో పాటు ఆయనే స్వయంగా పాడటం విశేషం. ఎనర్జీటిక్ బీట్స్, ఆకట్టుకునే సాహిత్యంతో ఈ సాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. సేనాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. దీప్తి సురేష్, భూమికలు సాయి అభ్యాంకర్‌తో కలిసి ఈ పాటను అలపించారు.

Also Read- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంఛింగ్ డేట్ ఖరారు.. చద‌రంగం కాదు, ర‌ణ‌రంగ‌మే!

విజువల్స్ హైలెట్
యూత్ ఫుల్ వైబ్‌తో వచ్చిన ఈ పాట విజువల్స్ కూడా వావ్ అనేలా ఉన్నాయి. సరదాగా గడిపే ఫ్రెండ్స్ గ్యాంగ్, ప్రదీప్, మమిత కెమిస్ట్రీ, స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌లతో సాంగ్ చాలా ట్రెండీగా ఉండటంతో యూత్‌ని ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌‌గా, లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ దీపావళికి ‘డ్యూడ్’ కలర్‌ఫుల్, మ్యూజిక్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘డ్రాగన్’లానే ఈ సినిమా కూడా ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని టీమ్ ఆశిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు