The Raja Saab: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది రాజా సాబ్’ యాక్షన్, రొమాన్స్, డ్రామాతో ఒక గ్రాండ్ సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది. ‘ది రాజా సాబ్’ సినిమాను మారుతి దర్శకత్వంలో తెరకెక్కతుంది. ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఎం స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మితమవుతోంది. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని, రొమాంటిక్, భావోద్వేగ ఎలిమెంట్స్‌తో కూడిన కథాంశం ఉంటుందని సమాచారం. సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ ట్రైలర్ సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది. దాని రన్‌టైమ్ 3 నిమిషాల 30 సెకండ్లుగా ఉంది. దీనిని అక్టోబర్ 2 నుండి ‘కాంతార చాప్టర్ 1’ సినిమాతో పాటు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ప్రభాస్ డైనమిక్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు భావోద్వేగ హైలైట్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ది రాజా సాబ్ సినిమా ఒక భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
బాహుబలి, సలార్ వంటి భారీ విజయాల తర్వాత, ప్రభాస్ నటించిన ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ది రాజా సాబ్ కూడా అతని స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా ఒక భారీ బ్లాక్‌బస్టర్‌గా రూపొందుతోందని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు మారుతి, గతంలో రొమాంటిక్ కామెడీ చిత్రాలకు పేరుగాంచినవారు, ఈ సినిమాతో ఒక కొత్త జోనర్‌లో తన సత్తా చాటనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ సినిమా సంక్రాతి సందర్భంగా జనవరి 9, 2025న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, భాషల్లో విడుదలకానుంది.