Spirit Movie: ‘స్పిరిట్’ నుంచి ఈ ఫస్ట్ లుక్ చూశారా..
sprit-movie(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Spirit Movie: ‘స్పిరిట్’ నుంచి ఈ ఫస్ట్ లుక్ చూశారా.. ప్రభాస్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు..

Spirit Movie: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభాస్ సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఈ పోస్టర్ సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్సిటీకి అద్దం పడుతోంది. ప్రభాస్ వెనుక నుండి కనిపిస్తూ, ఒంటిపై రక్తం, గాయాలతో పవర్‌ఫుల్ లుక్‌లో ఉన్నారు. భుజాలపై ఉన్న బ్యాండేజీలు ఒక భీకరమైన పోరాటాన్ని సూచిస్తున్నాయి. పొడవాటి జుట్టు, గడ్డంతో ప్రభాస్ చాలా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. నోట్లో సిగరెట్, ఒక చేతిలో మందు గ్లాస్, మరొక వైపు ఒక మహిళ లైటర్ వెలిగిస్తుండటం.. సందీప్ వంగా సినిమాల్లో ఉండే వైల్డ్ నేచర్‌ను ప్రతిబింబిస్తోంది. ఈ సినిమా కేవలం భారత్‌లోనే కాకుండా చైనీస్, జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల కాబోతుంది.

Read also-Bhootham Praytham: ‘భూతం ప్రేతం’ న్యూ ఇయర్ స్పెషల్‌ ‘చికెన్ పార్టీ’ సాంగ్ చూశారా?

ప్రభాస్ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం విశేషం. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్ మంచి హిట్ సాధించాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.

Read also-Purushaha: పాపం సప్తగిరి.. ‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్‌ ఫస్ట్ లుక్!

Just In

01

LPG Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.111 పెంపు

Congress Jumbo Committees: నూతన సంవత్సరంలో జిల్లాలకు కాంగ్రెస్ జంబో కమిటీలు?.. పూర్తి ప్లాన్ దీని కోసమే..?

Hyderabad Liquor Sales: ఇలా తాగేశారేంట్రా.. డిసెంబర్ 31 రాత్రి.. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్!

GHMC Achievements 2025: హైదరాబాద్ చరిత్రలోనే ఇదొక మైలురాయి.. 2025 సంవత్సరంలో ఇదే అతి పెద్ద రికార్డు..?

TG ACB Rides: 2025 లో ఏసీబీ దూకుడు.. వందల కోట్ల అక్రమాస్తుల పూర్తి సమాచారం ఇదే..!