Rajasaab Song: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజాసాబ్’ నుంచి మోస్ ఎవైటెడ్ సాంగ్ ‘సహనా సహనా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సాంగ్ ప్రభాస్ సాబ్ హిట్ లిస్ట్ లో చేరిపోతుంది. ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.250 కోట్లుకు పైగా వసూలు చేసింది. నిథి అగర్వాల, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా కామెడీ హర్రర్ ఫ్యాంటసీ థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి థమన్ అందించిన సంగీతం ప్రతి పాటను మరో స్థాయిలో నిలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నానమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది. తాజాగా విడుదలైన ‘సహనా సహనా’ సాంగ్ సంగీత ప్రియులను ఒక ఊపు ఊపేసింది.
Read also-Prabhas Spirit: ‘ది రాజాసాబ్’ నిర్మాతకు ‘స్పిరిట్’ తెలుగు రైట్స్.. మొత్తం తెలిస్తే షాక్ అవుతారు

