Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన నటించిన ఓజీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 25 న రిలీజ్ కు సిద్ధమైంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ‘ఓజీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21, 2025న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. సోమవారం ‘OG’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు 80 లక్షలకి పైగా చూశారు. ప్రస్తుతం, ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Damodar Rajanarsimha: ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు చేయాల్సిందే: మంత్రి దామోదర రాజనర్సింహ
అయితే, ఎన్నడూ లేనిది పవన్ కొత్త సినిమా రిలీజ్ సమయంలో డిజాస్టర్ మూవీని గుర్తు చేసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘థే కాల్ హిమ్ OG’ (OG) మరో రెండు రోజుల్లో, అంటే సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాలోని జపనీస్ కతానా కత్తిని పట్టుకొని, నల్లటి దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించిన పవన్, అభిమానులను పూనకంతో ఊగిపోయేలా చేశారు.
‘పంజా’తో ‘OG’ సినిమా ఎందుకు పోలుస్తున్నారు?
‘OG’ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో గన్ పట్టుకొని కనిపించిన తీరు, ఆయన 2011లో వచ్చిన ‘పంజా’ సినిమాను ఫ్యాన్స్ కు గుర్తు చేసింది. ‘పంజా’లో కూడా పవన్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో గన్‌తో కనిపించి, ఆకట్టుకున్నారు. అయితే, ‘పంజా’ కథ పరంగా బాగున్నప్పటికీ.. విష్ణువర్ధన్ దర్శకత్వం ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో వైరల్ అయినప్పటికీ.. పవన్ నటన మాత్రం హైలెట్ అని చెప్పుకోవాలి.
Also Read: Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!