Hari Hara Veera Mallu Song Promo: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు పార్ట్‌లుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మొదటి పార్ట్‌కి ‘హరి హర వీరమల్లు పార్ట్- 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ వదిలారు. ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే ఈ పాట ప్రోమో ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా దూసుకెళుతోంది. ఎందుకంటే, ఈ ప్రోమోతో అలాంటి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఇంతకీ ఆ ట్రీట్ ఏంటని అనుకుంటున్నారా? మొదటి నుండి వినబడుతున్నట్లుగా ఈ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ కనిపించలేదు. హాట్ బ్యూటీస్ అనసూయ, పూజిత పొన్నాడ సర్‌ప్రైజ్ ఎంట్రీతో షాకిచ్చారు.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
నిజంగా ఇది ఊహించని సర్‌ప్రైజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ సినిమాలో నేను చేస్తున్నానని అనసూయ (Anasuya) ఆ మధ్య చెప్పింది కానీ, ఎందులో అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ‘హరి హర వీరమల్లు’లో అయితే అనసూయ నటించి ఉండదులే అని అంతా అనుకుంటుంటే, సడెన్‌గా ఇలా అనసూయని చూపించి, అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు మేకర్స్. అనసూయతో పాటు గ్లామర్ డాల్ పూజిత పొన్నాడ కూడా దర్శనమివ్వడంతో, ఈ పాట రేంజే మారిపోయింది. వారి సంగతి అలా ఉంటే, పవన్ కళ్యాణ్‌ని స్క్రీన్‌పై చూసి చాలా కాలం అవుతుంది. అలాంటిది ఈ పాటలో, ఇప్పటి వరకు ఆయన కనిపించని అవతార్‌లో, వీరోచిత లుక్స్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
‘కోర కోర మీసాలతో, కొదమ కొదమ అడుగులతో..
కొంటె కొంటె చణుకులతో, కొలిమి లాంటి మగటిమితో..
సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడు’.. అంటూ చంద్రబోస్ రాసిన పవర్ ఫుల్ లిరిక్స్‌తో వచ్చిన ఈ పాటకి ఆస్కార్ విజేత కీరవాణి ఇచ్చిన మ్యూజిక్, మంగ్లీ వాయిస్ హైలెట్స్ అనేలా ఉన్నాయి. మంగ్లీతో పాటు ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఆలపించారు. ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24 సాయంత్రం 3గంటలకు విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. నిర్మాత ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. అంతకు ముందు కొంతమేర ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉండగా.. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నట్లుగా చిత్రబృందం తెలుపుతోంది.
ఇవి కూడా చదవండి: