Peddi Movie Team
ఎంటర్‌టైన్మెంట్

Peddi Movie: ఏఆర్ రహ్మాన్‌ను కలిసిన ‘పెద్ది’ టీమ్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ రాబోతోంది!

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi). ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్, రామ్ చరణ్ మేకోవర్ ఫ్యాన్స్‌లోనూ, అలాగే సినిమా లవర్స్‌లోనూ అంచనాలు భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్‌ని ఇచ్చారు. అదేంటంటే..

Also Read- Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్

త్వరలోనే ఫస్ట్ సింగిల్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లుగా మేకర్స్ సోమవారం (సెప్టెంబర్ 1) అనౌన్స్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ పాట నిమిత్తమై ఏఆర్ రహ్మాన్ (AR Rahman) స్టూడియోలో వున్న ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ‘పెద్ది’ కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహ్మాన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ని కంపోజ్ చేసినట్లుగా ఇప్పటికే బుచ్చిబాబు సానా ప్రకటించారు. ఆడియన్స్, ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్‌ని ఏఆర్ రహ్మాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే రాబోయే ఫస్ట్ సింగిల్ ‘పెద్ది’ పాత్రకు సంబంధించిన టైటిల్ సాంగ్ అని రామ్ చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను 2026, మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫుల్ మీల్స్ పోస్టర్.. హరీష్‌కు ఈసారి టెంపులే!

1000 మందికి పైగా డాన్సర్లతో సాంగ్
తన అమ్మమ్మ అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియల అనంతరం రామ్ చరణ్ వెంటనే ‘పెద్ది’ సినిమా షూటింగ్ నిమిత్తం మైసూర్ పయనమైన విషయం తెలిసిందే. మైసూర్ వెళ్లిన ఆయన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసి, చిత్ర విశేషాలను తెలియజేశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ప్రస్తుతం మైసూర్లో జానీ మాస్టర్ ఒక భారీ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేస్తున్నారు. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ సాంగ్ షూట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాలో అదిరిపోతుందని చిత్ర బృందం అంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!