Peddi Still
ఎంటర్‌టైన్మెంట్

Peddi First Shot: ఇది కదా కావాల్సింది.. ‘పెద్ది ఫస్ట్ షాట్’ ఫ్యాన్స్‌కి పండగే!

Peddi First Shot: శ్రీరామనవమి ఫెస్టివల్‌ను పురస్కరించుకుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ షాట్‌ని మేకర్స్ విడుదల చేశారు. అనుకున్న టైమ్‌కి ఈ ఫస్ట్ షాట్ వస్తుందా? లేదా? అనే అనుమానాలకు తెరదించుతూ, కరెక్ట్‌గా చెప్పిన టైమ్‌కి మేకర్స్ ఈ ఫస్ట్ షాట్‌ని వదిలారు. ఈ మధ్య కాలంలో మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ సాధించడం లేదు.

Also Read- Mohan Babu: పక్కవాళ్లు నాశనం కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు.. ఏం చెప్పారు సార్!

చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్‌ను రాబట్టలేకపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ సినిమాల సక్సెస్ పరంగా డౌన్‌లో ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణే నిలబెట్టాడు. ఇప్పుడు మళ్లీ చరణే ఆ డ్యూటీ తీసుకోబోతున్నాడనేలా ‘పెద్ది’ ఫస్ట్ షాట్ ఉంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, సంచలనాత్మక దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్నచిత్రం ‘పెద్ది’. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెద్ది చిత్రం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో అభిమానుల అంచనాల్ని పెంచేలా పెద్ది ఫస్ట్ షాట్ పవర్-ప్యాక్డ్ విజువల్ ట్రీట్‌‌తో ఫ్యాన్స్‌కు పండగ తెచ్చేసింది. ఈ ఫస్ట్ షాట్ ఎలా ఉందంటే..

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి మళ్లీ.. సెప్పిమి’’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో వచ్చిన ఈ ట్రైలర్‌లో ప్రతి షాట్ అరాచకం అనేలా ఉంది. ఫ్యాన్స్‌కి పూనకాలు పక్కా. రామ్ చరణ్ లుక్, ఒక్కొక్క విజువల్, చివరిలో క్రికెట్ షాట్.. అన్నీ కూడా ఇది కదా మాకు కావాల్సింది అని మెగా ఫ్యాన్స్‌తో అనిపిస్తున్నాయంటే.. ఏ స్థాయిలో ఈ గ్లింప్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా లాస్ట్ క్రికెట్ షాట్.. చూస్తే, ఈ సినిమా మాములుగా ఉండదనే ఫీల్ ఇచ్చేస్తుంది. ఓవరాల్‌గా అయితే, మెగాభిమానులకు బుచ్చి ఇచ్చే ట్రీట్ మాములుగా ఉండదని, ఇక రికార్డులు ఏమేం బద్దలు కొట్టాలో బయటికి తీయండి అనేలా ఫ్యాన్స్‌ని సూచిస్తున్నట్లుగా ఈ ఫస్ట్ షాట్ ఉంది. ఏఆర్ రెహమాన్ డ్యూటీ ఎక్కేశాడంతే.

Also Read-Alekhya Chitti Pickles Controversy: నా ముగ్గురు చెల్లెళ్లు తప్పు చేశారు.. క్షమించండి.. అన్వేష్ వీడియో వైరల్!

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ ఓ అద్భుతమైన పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సినిమా ప్రారంభమై, షూటింగ్ జరుపుకుంటున్న అతి తక్కువ సమయంలోనే ఇలా గ్లింప్స్‌తో మెగా ట్రీట్ ఇచ్చినందుకు అభిమానులందరూ బుచ్చిబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు