Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ 2025 లో మెరిసిన దేవీ శ్రీ ప్రసాద్ తాను చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పుకొచ్చారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి చేయబోతున్నారు కదా పాటులు ఎలా ఉండబోతున్నాయి అని అడగ్గా.. దేవీశ్రీ ఇలా చెప్పుకొచ్చారు.. మొన్న జరిగిన సాంగ్ అదిరిపోద్ధి. ఈ సాంగ్ షూట్ అయిన తర్వాత కళ్యాణ్ గారు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. పాట చాలా బాగా వచ్చింది. చాలా కాలం తర్వాత నాకు కూడా స్టెప్పులు వేయాలనిపించింది. అంటూ చెప్పుకొచ్చారని తెలిపారు. ఇంత బాగా వచ్చిన పాటను హరీష్ శంకర్ అంతకంటే బాగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు మరో గబ్బర్ సింగ్ హిట్ట అవుతుందని అభిమానులు ఆసిస్తున్నారు.
Read also-Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. 2012లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. 2016లో విడుదలైన తమిళ చిత్రం ‘తేరి’ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ స్టైల్‌కు తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, నవాబ్ షా వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Read also-Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా సాగుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్టైలిష్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 2025లో ప్రారంభమై, ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశం భావోద్వేగ, యాక్షన్ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో మాస్ ఎంటర్‌టైనర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా 2026లో విడుదల కానుందని సమాచారం. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నారు.