Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయాల సందర్శన కొనసాగుతోంది. బుధవారం ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా కేరళకు వెళ్లిన ఆయన.. అక్కడ పలు ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత గురువారం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని స్వామిమలై ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ కుమారస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నారు.
తమిళనాడులోని ఇంకా కొన్ని ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శిస్తారని తెలుస్తోంది. ఇక తమిళనాడు రాజకీయాలపై కూడా ఏమైనా కామెంట్ చేస్తారేమో అని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ (Pawan Kalyan) అయితే ఎలాంటి కామెంట్లు చేయట్లేదు. కానీ హిందూ ఆలయాల పరిరక్షణపై మాట్లాడుతూ వస్తున్నారు. తమిళనాడులోని బీజేపీ ముఖ్య నేతలను కలుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు.