Pawan Kalyan weakness: పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఓజీ’ బ్లాక్ బాస్టర్ మీట్ నిర్వహించారు నిర్మాతలు. ఈ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన వీక్నెస్ గురించి చెప్పుకొచ్చారు. ఒకా నొక సందర్భంలో పూరీ జగన్నాధ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నిజమనే అంటున్నారు ఫ్యాన్స్. పూరీ ఏం అన్నాడంటే.. పవన్ కళ్యాణ్ కు కథ చెప్పేటపుడు అందులో గన్స్, ఉన్నాయంటే చాలు ఆయన వెంటనే కథ ఒప్పేసుకుంటారు, అని అన్నారు. దానికి తగ్గట్టుగా పవన్ కూడా కత్తులు, కటానాలు, గన్స్, బులెట్స్ అంటే తనకెంతో ఇష్టమని ఓజీ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ లో చెప్పారు. అవి ఉంటే సినిమా చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు ధమన్ గన్ పట్టుకుని స్టేజ్ మీదకు రావాలని చెప్పడంతో నో చెప్పలేక పోయానన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ వీక్నెస్ ఏంటో అభిమానులకు తెలిసిపోయింది.
Read also-Kothagudem District: ఓబీ కంపెనీలో మహిళా కార్మికులకు రక్షణ కరువు.. పట్టించుకోని అధికారులు
ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.
పవన్ కళ్యాణ్ అభినయం, ఎమ్రాన్ హాష్మీ విలన్ రోల్‌తో విడుదలైన ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG), టాలీవుడ్‌లో టెక్నికల్ ఎక్సలెన్స్‌కు మరో ఉదాహరణ. డైరెక్టర్ సుజీత్, తన స్క్రిప్ట్‌తో గ్యాంగ్‌స్టర్ లోకాన్ని రివైవ్ చేశాడు. ప్రొడ్యూసర్స్ డీ.వి.వి. దానయ్య, కల్యాణ్ దాసరి (సురేష్ ప్రొడక్షన్స్) బ్యాక్‌బోన్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ షేప్ తీసుకుంది. టెక్నికల్ టీం సూపర్! సినిమాటోగ్రఫీలో రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస డ్యూయల్ వర్క్ – ముంబై అండర్‌వరల్డ్‌ను విజువల్ స్పెక్టాకల్‌గా మార్చారు. మ్యూజిక్ కంపోజర్ థమన్ ఎస్, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌కు బీట్స్ ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి, పేసింగ్‌ను టైట్‌గా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్. ప్రకాశ్, 1990ల ముంబై లుక్‌ను రియలిస్టిక్‌గా సెట్ చేశాడు.