Hari Hara Veera Mallu: ప్రస్తుతం సినీ ప్రపంచమంతా ‘ఛావా’(Chhava) నామస్మరణతో మార్మోగుతోంది. మరాఠా వీరుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తుంది. నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal) ఉగ్రరూపంతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తున్నాడు. లక్షణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. పెద్దలతో పాటు చిన్న పిల్లల్ని సైతం ఈ సినిమా కట్టి పడేస్తుంది. థియేటర్‌లలో ప్రేక్షకులు ఎమోషనల్ గురవుతున్న సన్నివేశాలు కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. ఇది పక్కనా పెడితే.. ‘ఛావా’కు మించిన వీరత్వం, ఎమోషన్స్, కథతో తెలుగులో ఓ సినిమా రానుంది. ఇప్పటి వరకు ఆ హీరో అభిమానులే ఆ సినిమాని తక్కువ అంచనా వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకీ మేటర్ ఏంటంటే..
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతోగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఓజీ'(OG). అయితే ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా మీద కూడా అంచనాలు ఉన్నా అభిమానులు ‘ఓజీ’కే ఎక్కువ హైప్ ఇవ్వడం క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ.. ‘హరి హర వీర మల్లు’ కథ నేపథ్యం కూడా మాములుగా లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కథను తెలంగాణ వీరుడు పాత్ర సర్వాయి పాపన్న జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. శంభాజీ మహారాజ్ ఎదురుకున్నట్లే పాపన్న కూడా ద్రోహాన్ని ఎదురుకున్నాడు. చిన్న సైన్యం ఏర్పరుచుకొని శత్రువుల సైన్యాలను చీల్చి చెండాడాడు.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
1650లో జన్మించిన పాపన్న కల్లు గీత వృత్తి చేసేవాడు. ఒక స్నేహితుడి కారణంగా పన్ను వసూలు చేస్తున్న తురుష్క సైనికులతో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ గొడవ పెద్దది కావడంతో కుల మతాలకతీతంగా 3 వేల మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు. మరాఠా సామ్రాజ్యంలో శివాజీకి సమాంతరంగా ఆయన మొఘల్, గోల్కొండ పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర సామ్రాజ్యాలపై పోరాడి విజయాలను సొంతం చేసుకున్నాడు. పాపన్న దాడులకు నిజాంనవాబులు కూడా బెంబేలెత్తిపోయేవారట. దీంతో హరి హర వీర మల్లు సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతోంది.
ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాను ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నాడు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.
మొదటి భాగం ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించాడు.
ఇవి కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సీన్ వాడేశా!