Pawan Producer: నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను కలిసిన పవన్ కళ్యాణ్
vreative-meating(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Producer: నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను కలిసిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

Pawan Producer: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’ గతేడాది ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో నటిస్తారనే విషయం ఇప్పటికీ వెళ్లడించలేదు. అయితే ఈ గ్యాప్ లో ఎప్పటినుంచో ఇన్ యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వక్స్ ను యాక్టివేట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ నిర్మాతగా సినిమాలు చేయనున్నారు. ఈ విషయం గురించి చర్చించేందుకు పవన్ కళ్యాణ్ భోగి పర్వదినం రోజున ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ను కలిశారు. తాజాగా ఈ కలయిక సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ కర్క్స్ అధికారిక సోషల్ మీడి యా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మీటింగ్ కు సంబధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read also-Megastar Comeback: ప్రసాద్ గారు ఇంట్లో మూవీ టీం సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్

తెలుగు చిత్రపరిశ్రమలో ‘పవర్ స్టార్’ గా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, కేవలం కెమెరా ముందు నటించడమే కాకుండా, కెమెరా వెనుక జరిగే సృజనాత్మక ప్రక్రియపై కూడా ఎంతో పట్టు ఉన్న వ్యక్తి. తన ఆలోచనలకు, అభిరుచులకు ఒక రూపం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన స్థాపించిన సంస్థే “పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్”. 2001లో ఈ సంస్థను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సాధారణ వాణిజ్య సినిమాలకు భిన్నంగా, సాంకేతిక విలువలు, కొత్త రకమైన కథా గమనం కలిగిన చిత్రాలను రూపొందించాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్, సంగీతం, విజువల్ స్టోరీ టెల్లింగ్‌పై తనకున్న మక్కువను ఈ బ్యానర్ ద్వారా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్నారు.

Read also-Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా అకౌంట్ డిలేట్ చేసిన టాక్సిక్ నటి.. ఎందుకంటే?

‘తమ్ముడు’, ‘బద్రి’ వంటి సినిమాల సమయం నుండే ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లలో తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నారు. ‘జానీ’ సినిమా కోసం ఆయన చేసిన కసరత్తులు ఈ బ్యానర్ క్రియేటివ్ పవర్ ను చూపిస్తాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా కథలు రాయడం, స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయడం వంటివి చేస్తుంటారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. నితిన్ కథానాయకుడిగా వచ్చిన ‘చల్ మోహన్ రంగ’ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరించి, కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ముందుంటుంది అని చాటి చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత కలవడంతో ప్రస్తుతం ఈ మేటర్ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇదే విషయంపై టీజీ విశ్వ ప్రసాద్ స్పందిస్తూ.. వపన్ కళ్యాణ్ సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్సతో కలిసి నడిచేందుకు తాను సిద్దంగా ఉన్నా అన్నారు. తనకు పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతే కాకుండా రానున్ను రోజుల్లో ఈ రెండ్ బ్యానర్స్ కలిపి సినిమాలు తీసేందుకు సుముఖతతో ఉన్నాయన్నారు.

Just In

01

Collector Rahul Sharma: సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు!

Anasuya: నేనూ మనిషినే, ఆ బలహీనత నా తప్పు కాదు.. అనసూయ షాకింగ్ పోస్ట్

Mahabubabad District: ఆ జిల్లాలో ఫంక్షన్ హాల్ అన్ని వివాదాస్పదమే.. అధికారుల మౌనం.. అక్రమాలకు కవచం?

Miracle Movie: సంక్రాంతి కానుకగా ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్ మోడ్‌లో ప్రభాస్ నిమ్మల

Forest Department: అటవీ శాఖ నిర్లక్ష్యం.. రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి!