Parasakthi Teaser (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Parasakthi Teaser: పెను సైన్యమై కదలిరా.. ‘పరాశక్తి’ టీజర్ ఎలా ఉందంటే?

Parasakthi Teaser: తమిళ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) తన తదుపరి భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi)తో 2026 సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో టాలీవుడ్ డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘హే సింగారాల సీతాకోకవే.. నీ అలకే తొలగి’ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ పాటలో శివకార్తికేయన్, గ్లామర్ క్వీన్ శ్రీలీలల మధ్య కెమిస్ట్రీ, రెట్రో థీమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..

Also Read- Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

మద్రాస్‌లో ఒకప్పుడు

శివకార్తీకేయన్ ఓ కళాశాలలోకి అడుగు పెడుతున్నట్లుగా టీజర్ ఓపెన్ అయింది. గోడపై ‘స్టూడెంట్స్ డు నాట్ టచ్’ అనే రెడ్ కలర్‌లో అక్షరాలు కనిపిస్తున్నాయి. ‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా’ అనే గ్రామ ఫోన్‌లో పాట ప్లే అవుతుండగా, స్టూడెంట్‌గా ఎస్‌కె నడుచుకుంటూ వెళుతున్నారు. కట్ చేస్తే.. ‘మద్రాస్‌లో ఒకప్పుడు’ అంటూ కాలేజ్ హాస్టల్‌లో తలుపులన్నీ బాదుతూ.. కొందరు స్టూడెంట్స్ కర్రలతో పరుగెత్తుకుంటూ వస్తుండటం చూపించారు. వారి ముందు అథర్వ (Atharvaa) కూడా ఒక కర్రతో ఫైట్‌కు బయలు దేరినట్లుగా చూపిస్తూ.. ఆయన లుక్ రివీల్ చేశారు. మరో వైపు రవి మోహన్ (జయం రవి) గన్ పేలుస్తున్నారు. అథర్వ పరిగెత్తుకుంటూ వెళ్లి.. శ్రీలీల (Sreeleela) వేసుకుని వచ్చిన కారులోకి ఎక్కారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద గొడవ జరుగుతూ ఉంది.

Also Read- SS Rajamouli: ఎవరు పడితే వాళ్లు రావడానికి.. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు! గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వచ్చే దారిదే!

డు నాట్ టచ్ స్టూడెంట్స్

అథర్వ వచ్చి శ్రీలీల కారు ఎక్కగానే.. నేను రాకపోతే ఈ పాటికి చచ్చి ఉండేవాడివిరోయ్ అని చెబుతోంది. రవి మోహన్ (Ravi Mohan) మాత్రం ఆపకుండా మాస్క్‌లో ఉన్న శివకార్తీకేయన్ బొమ్మను పేలుస్తూనే ఉన్నారు. రవి మోహన్ అక్కడ మాస్క్ తీయగానే.. కాలేజ్ పైన శివ కార్తీకేయన్ నిలబడి ఉన్నట్లుగా చూపించి, ఆయన లుక్‌ని రివీల్ చేశారు. ‘సైన్యమై కదలిరా.. పెను సైన్యమై కదలిరా..’ అని శివకార్తీకేయన్ నినాదం చేస్తుంటే.. మొదట్లో గోడపై ఉన్న అక్షరాలలో ‘డు నాట్ టచ్ స్టూడెంట్స్’ అని రాసి ఉండటం గమనించవచ్చు. మొత్తంగా అయితే 70-80ల నాటి కథతో సుధా కొంగర మాయ చేయబోతున్నట్లుగా అయితే ఈ టీజర్ తెలియజేస్తుంది. సాధారణంగా సుధా కొంగర సినిమాల్లో యాక్షన్, ఎమోషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది ఈ టీజర్‌లో అడుగడుగునా కనిపిస్తుంది. అలాగే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇది 100వ చిత్రం. ఆయన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు కీలక పాత్ర వహించబోతుందనేది కూడా ఈ చిన్న వీడియోతోనే తెలిసిపోతుంది. చూద్దాం మరి.. భారీ సినిమాలు ఉన్న సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలా నెట్టుకొస్తుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gadwal: గద్వాలలో దొంగల హల్చల్.. వరుస ఘటనలతో జనాల బెంబేలు

Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడ్ రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

POCSO Case: పోక్సో కేసులో దోషికి తగిన శిక్ష విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్..

Peddi: ‘పెద్ది’ షూటింగ్ వాయిదా.. కారణం ఏంటో తెలుసా?

Gold Chain Theft: 4 తులాల గోల్డ్ చైన్ చోరీ.. 12 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే?