Prabhas: పాన్ ఇండియా స్టార్.. పబ్లిక్‌లో మాట్లాడాలంటే ఇంకా సిగ్గే!
Prabhas (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Prabhas: పాన్ ఇండియా స్టారైనా.. పబ్లిక్‌లో మాట్లాడాలంటే ఇంకా సిగ్గే!

Prabhas: ఇండియన్ సినిమా రేంజ్‌ను గ్లోబల్ స్థాయికి చేర్చిన రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం ‘ది రాజా సాబ్’‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. శనివారం జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ హాజరవడంతో అభిమానుల కోలాహలం అంబరాన్నంటింది. చాలా రోజుల తర్వాత పబ్లిక్ ఈవెంట్‌లోకి వచ్చిన ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. కానీ, స్టేజ్ ఎక్కిన తర్వాత ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ మాత్రం మిశ్రమ స్పందనను రాబట్టింది. ప్రభాస్ అంటేనే ఒక సైలెంట్ సునామీ. స్క్రీన్ మీద ఆయన విన్యాసాలు చూస్తే వెయ్యి ఏనుగుల బలం కనిపిస్తుంది. కానీ, రియల్ లైఫ్‌లో మైక్ పట్టుకుంటే మాత్రం మన డార్లింగ్ ఇప్పటికీ ఆ పాత సిగ్గునే వదలడం లేదు. వేలాది మంది అభిమానులు తమ ప్రియతమ హీరో వచ్చి స్పీచ్‌తో స్టేజ్ మీద బాంబులు పేలుస్తారని ఆశపడ్డారు. కానీ ప్రభాస్ స్పీచ్ చాలా సాదాసీదాగా, కొంచెం నీరసంగా సాగిందని టాక్ నడుస్తోంది.

Also Read- Aadi Saikumar: ‘శంబాల’ సక్సెస్ జోష్‌.. హిట్ బ్యానర్‌లో ఆదికి బంపరాఫర్!

స్టార్‌డమ్ వేరు.. సంస్కారం వేరు

అంతర్జాతీయ స్థాయి స్టార్‌డమ్ ఉన్న హీరో, పబ్లిక్ ఫంక్షన్లలో మరింత ఎనర్జిటిక్‌గా మాట్లాడితే ఫ్యాన్స్‌కు వచ్చే ఆ కిక్కే వేరు. ఈ విషయంలో మన డార్లింగ్ కొంచెం మారాలని, తన లోపల ఉన్న ‘మాస్’ని బయటకు తీయాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. స్పీచ్‌లో ఎనర్జీ తక్కువైనా.. ప్రభాస్ చూపించిన ‘సంస్కారం’ మాత్రం ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. తనకంటే సీనియర్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవం చూసి అందరూ ఫిదా అయ్యారు. ‘సీనియర్స్ తర్వాతే మనం.. వాళ్ల నుంచే మనం ఎన్నో నేర్చుకున్నాం’ అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. సంక్రాంతికి వస్తున్న చిరంజీవి, వెంకటేష్, రవితేజ వంటి సీనియర్ హీరోల మీద ప్రభాస్ కురిపించిన ప్రేమ చూసి మెగా ఫ్యాన్స్ నుంచి మాస్ రాజా ఫ్యాన్స్ వరకు అందరూ హ్యాపీ. ఎదుటివారికి గౌరవం ఇవ్వడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అని ఈ వేడుక మరోసారి ప్రూవ్ చేసింది.

Also Read- TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు.. కీలక పదవులు వీరికే!

ఫ్యాన్స్ కోరిక ఒక్కటే..

ప్రభాస్ నీ హంబుల్ నెస్‌కి జేజేలు.. కానీ నువ్వు మైక్ పట్టుకుంటే ఒక ‘మిర్చి’ లోని డైలాగ్ లాగానో, లేదా ‘ఛత్రపతి’ లోని ఎలివేషన్ లాగానో ఏదైనా స్పీచ్ దంచితే చూడాలని మా అందరి కోరిక. నీ సిగ్గు చూసి మురిసిపోయే కాలం దాటిపోయింది, ఇప్పుడు మాకు నీ దగ్గర నుంచి బాక్సాఫీస్ రికార్డులే కాదు.. స్టేజ్ మీద ఊగిపోయే స్పీచ్‌లు కూడా కావాలి! అనేలా ఈ ఈవెంట్ తర్వాత ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా, ప్రభాస్ సిగ్గుపడినా.. నవ్వినా.. అది ఆయన ఫ్యాన్స్‌కు ఒక ఎమోషన్. ‘ది రాజా సాబ్’తో ఆయన పడే ఆ సిగ్గును వెండితెర మీద వినోదంగా చూడాలని అందరం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈవెంట్‌లో అయినా, మీ అభిమానుల కోసం కొంచెం జోష్ పెంచండి డార్లింగ్..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kichcha Sudeepa: ఇతర ఇండస్ట్రీ స్టార్స్‌పై సుదీప్ సంచలన వ్యాఖ్యలు

Prabhas: పాన్ ఇండియా స్టారైనా.. పబ్లిక్‌లో మాట్లాడాలంటే ఇంకా సిగ్గే!

iBomma Ravi: రవి ప్రహ్లాద్‌ని పిలిపించిన అధికారులు.. ఐ బొమ్మ రవి కేసులో కీలక అప్డేట్!

Director Maruthi: మొన్న అన్ని నీతులు చెప్పావ్.. ఇదేంటి మారుతి?

Etela Rajender: నేను సీరియస్ పొలిటీషియన్.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్