Aadi Saikumar: ‘శంబాల’ సక్సెస్ జోష్‌.. నెక్స్ట్ హిట్ బ్యానర్‌లో!
Aadi Saikumar (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Aadi Saikumar: ‘శంబాల’ సక్సెస్ జోష్‌.. హిట్ బ్యానర్‌లో ఆదికి బంపరాఫర్!

Aadi Saikumar: టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్ (Aadi Saikumar), తాజాగా ‘శంబాల’ (Shambhala) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం ఆది కెరీర్‌లో మరో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంలో ఆది సాయికుమార్ అభిమానులకు మరో అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. ‘శంబాల’ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, టాలీవుడ్ ‘రైజింగ్ ప్రొడ్యూసర్’గా పేరు తెచ్చుకున్న రాజేష్ దండా (Rajesh Danda), ఆది సాయికుమార్‌ను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేశారు. సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆది నటనను ప్రశంసించారు. అయితే, ఈ భేటీ కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాలేదు.. ఒక క్రేజీ అప్‌డేట్‌కు వేదికగా మారింది.

Also Read- TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు.. కీలక పదవులు వీరికే!

హాస్య మూవీస్ బ్యానర్‌లో నెక్ట్స్ మూవీ!

వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హాస్య మూవీస్ (Hasya Movies) బ్యానర్‌లో ఆది సాయికుమార్ తదుపరి చిత్రం ఉండబోతోందని రాజేష్ దండా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. హాస్య మూవీస్ అంటేనే మినిమం గ్యారెంటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆది సాయికుమార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది ఎవరు? ఇతర నటీనటులు ఎవరు? అనే వివరాలను రాజేష్ దండా అతి త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read- Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్

సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాస్య మూవీస్ బ్యానర్ ఒక బ్రాండ్‌గా మారింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్‌ను అందిస్తూ ప్రేక్షకులకు దగ్గరైందీ బ్యానర్. ఇటీవల దీపావళి కానుకగా కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘కె ర్యాంప్’ (K Ramp) సినిమాను నిర్మించి, బ్లాక్ బస్టర్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలను నిర్మించడం రాజేష్ దండా స్టైల్. ఇప్పటికే మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఈ సంస్థలో నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆది సాయికుమార్ సినిమా కూడా చేరింది. ‘శంబాల’ సక్సెస్‌తో పాటు, హాస్య మూవీస్ వంటి సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో సినిమా ఓకే అవ్వడం ఆది సాయికుమార్ కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. రాజేష్ దండా నిర్మాణంలో రాబోయే ఈ చిత్రం ఆదిని మాస్, క్లాస్ ఆడియన్స్‌కు మరింత చేరువ చేస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్‌ను తెలియజేస్తామని ఈ సందర్భంగా రాజేష్ దండా ప్రకటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kichcha Sudeepa: ఇతర ఇండస్ట్రీ స్టార్స్‌పై సుదీప్ సంచలన వ్యాఖ్యలు

Prabhas: పాన్ ఇండియా స్టారైనా.. పబ్లిక్‌లో మాట్లాడాలంటే ఇంకా సిగ్గే!

iBomma Ravi: రవి ప్రహ్లాద్‌ని పిలిపించిన అధికారులు.. ఐ బొమ్మ రవి కేసులో కీలక అప్డేట్!

Director Maruthi: మొన్న అన్ని నీతులు చెప్పావ్.. ఇదేంటి మారుతి?

Etela Rajender: నేను సీరియస్ పొలిటీషియన్.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్