Oscars 2025: ఆస్కార్ అవార్డుల వేడుక విషయంలో ఈ మధ్య ఎలాంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. లాస్ ఏంజిల్స్‌లో నెలకొన్న కార్చిచ్చు కారణంగా ఈ అవార్డుల వేడుక ఈ సంవత్సరం ఉండదనేలా వచ్చిన వార్తలకు, వెంటనే అకాడమీ మెంబర్స్ క్లారిటీ ఇచ్చారు. అవార్డుల ఎంపిక విషయంలో ఆలస్యం ఏమైనా అవ్వవచ్చు కానీ, ప్రజంటేషన్ తేదీ, స్థలంలో మాత్రం మార్పు ఉండదని ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే మార్చి 3వ తేదీ ఉదయం 5.30 గంటలకు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా వేడుక జరిగింది. మొత్తం 23 విభాగాల్లో ఒక్కో విభాగంలో విజేతను ప్రకటిస్తూ అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించారు. అయితే ఇండియన్ ప్రేక్షకులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. భారత్ తరపున ఒకే ఒక్క విభాగంలో ఉన్న ‘అనూజ’ లఘు చిత్రాన్ని అవార్డు వరించలేదు. ఆ విభాగం (బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్)లో అవార్డును ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ను వరించింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరూ నిరాశకు లోనయ్యారు. మొత్తంగా 23 విభాగాల్లో అకాడెమీ అవార్డులు ఎవరెవరిని వరించాయంటే..
Also Read- Meenakshi Chaudhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి.. అంతా ఫేక్! చర్యలు తప్పవ్
97వ అకాడెమీ అవార్డ్ విజేతలు వీరే..
ఉత్తమ నటుడు- అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి- మైకీ మ్యాడిసన్ (అనోరా)
ఉత్తమ చిత్రం – అనోరా
ఉత్తమ దర్శకత్వం- అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సహాయ నటుడు- కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి- జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే- అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ- ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
ఉత్తమ సౌండ్- డ్యూన్: పార్ట్2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- డ్యూన్:పార్ట్2
ఉత్తమ ఒరిజినల్ సాంగ్- ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్- బ్రెజిల్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్- ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- వికెడ్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- నో అదర్ ల్యాండ్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ఐయామ్ నాట్ ఏ రోబో
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్- ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్- ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్- అనోరా (సీన్ బేకర్)
రెడ్ కార్పెట్ హీటెక్కింది
ఆస్కార్ అవార్డ్స్ అనగానే అవార్డుతో పాటు రెడ్‌కార్పెట్ కూడా హైలెట్ అవుతుంది. స్టార్ సెలబ్రిటీలందరూ ప్రత్యేకమైన మేకోవర్‌లో కనిపించి ఆహుతుల్ని అలరిస్తుంటారు. వారిని చూసేందుకే జనం ఎగబడుతుంటారు. ఈసారి కూడా తారల తళుకులతో రెడ్‌కార్పెట్ హీటెక్కింది. సెలీనా మేరీ గోమెజ్, రాచెల్ అన్నే జెగ్లర్, నిక్కీ గ్లేజర్, మోనికా మారియా బార్బరో, మోలీ సిమ్స్, మిల్ రే సైరస్, మైకేలా మాడిసన్, సారా మార్గరెట్ క్వాలీ, కెలీ స్పెర్రీ, జాండిలే డ్లామిని, అనా సెలియా డి వంటి వారంతా ఆస్కార్ వేడుకలో హోయలొలికించారు.
ఇవి కూడా చదవండి:
MAD Square vs Robinhood: ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ రోజే ‘మ్యాడ్ స్క్వేర్’.. నిజంగా అమావాస్యే కారణమా?
Vidya Balan: ఆ వీడియోలు నావి కావు.. డీప్ ఫేక్ బారిన విద్యాబాలన్