Tollywood: సినీ ఇండస్ట్రీలో చిన్నచిన్న పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి పెద్ద స్టార్స్‌గా ఎదిగిన వారెందరో ఉన్నారు. యాంకర్స్‌గా, ఇతర రంగాల్లో రాణించిన వారు సైతం గొప్ప నటీనటులుగా రాణిస్తున్నారు. ఈ జాబితాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. మల్టీ టాలెంట్‌తో అన్ని రంగాల్లో రాణించింది. స్కూల్ టైమ్‌లో క్రీడల్లో సత్తాచాటింది. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని బహుమతులు, ఎన్నో మెడల్స్ సాధించింది. ఇంకా పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్, మిస్ ఇండియా పేజెంట్ వంటి టైటిల్స్ గెలుచుకుంది. అంతేకాదు పంజాబ్‌లో నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో డెంటిస్ట్‌గా కోర్స్ కంప్లీట్ చేసి.. కొంతకాలం డెంటిస్ట్ వైద్యురాలిగా కూడా పని చేసింది. ఆ తర్వాత చిన్న సినిమాతో సినీ కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary).
టాలీవుడ్ హీరో సుశాంత్ నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంతో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత ఖిలాడి, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ హిట్ ని సొంతం చేసుకుంది. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వెంకీకి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడా రెకార్డులోకి ఎక్కింది. రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం కామెడీతో ఎంతగానో అలరించింది. భారీ హిట్ తో హ్యాపీగా ఉన్న మీనాక్షి చౌదరికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి సైన్ చేస్తోందట ఈ బ్యూటీ.
Also Read: నా పర్సనల్ విషయాలు బయటికి చెప్పను: యామీ గౌతమ్
అయితే బుధవారం (మార్చి 5) మీనాక్షి చౌదరి పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. వరుసగా సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని, ఎనర్జీ లెవెల్ అలాగే మెయింటైన్ చేయాలని అంటున్నారు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ మరిన్ని చిత్రాలు తీయాలని మనకు కూడా ఆశీర్వదిద్దాం.