Oh Bhama Ayyo Rama: వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ.. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే హీరోగానూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ నటుడు సుహాస్ (Suhas). ఆయన హీరోగా ఇప్పుడో అందమైన ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంతకు ముందు ఆయన చేసిన ‘జనక అయితే గనక’ అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించకపోవడంతో.. ఎలాగైనా ఈసారి ప్రేక్షకుల మన్ననలు పొంది, గొప్ప సక్సెస్ కొట్టాలని కసిగా ప్రయత్నిస్తున్నాడు సుహాస్. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama Movie) కోసం ఆయన పూర్తి స్థాయిలో మనసు పెట్టి చేస్తున్నాడనేలా వార్తలు వినవస్తున్నాయి.
Also Read- Robinhood: ‘గ్రోక్’ చెప్పిందే జరిగింది.. ఫైనల్‌గా డేవిడ్ వార్నర్‌కు లింక్ పెట్టారుగా!
‘ఓ భామ అయ్యో రామ’ విషయానికి వస్తే.. మలయాళ నటి మాళవిక మనోజ్ (Malavika Manoj) (‘జో’ ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో రామ్ గోధల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్‌ని కనుక్కుని మరీ విడుదల చేసే రానా దగ్గుబాటి (Rana Daggubati) తన స్పిరిట్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర టీజర్‌ను మార్చి 24న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు ఇద్దరూ ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు. హీరో సుహాస్ స్టైలిష్‌గా కనిపిస్తుండగా, హీరోయిన్ చక్కగా చీరకట్టుని తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. వీరిద్దరి ఆశ్చర్యానికి అనుగుణంగా వారి చుట్టూ ఉన్న వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంది. చూడగానే సాంగ్‌లోని స్టిల్ ఇదని తెలుస్తుంది. వీరిద్దరూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే.. చాలా లవ్లీగా అనిపిస్తుంది. ఇదే కాంబినేషన్‌పై ఇంతకు ముందు వచ్చిన గ్లింప్స్ కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టీజర్ తర్వాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయని యూనిట్ చెబుతోంది.
Also Read- Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్.. యాంకర్ శ్యామల పిటిషన్‌పై కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సుహాస్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే చిత్రంగా ఈ ‘ఓ భామ అయ్యో రామ’ ఉంటుంది. రాబోయే టీజర్ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూ, అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ది బెస్ట్ క్వాలిటీతో సినిమాను అందించబోతున్నాం. ఈ చిత్రంలో సున్నితమైన ప్రేమ, భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్ ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా దర్శకుడు సినిమాను రూపొందిస్తున్నారు. ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రస్తుతం చిత్ర షూటింగ్ చివరి దశలో ఉందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు