OG Movie: రెడ్ టవల్స్‌‌తో డెకరేషన్.. ఎలా వస్తాయో ఇలాంటి థాట్స్..
Pawan Kalyan OG
ఎంటర్‌టైన్‌మెంట్

OG Movie: రెడ్ టవల్స్‌‌తో డెకరేషన్.. ఎలా వస్తాయో ఇలాంటి థాట్స్.. వీడియో వైరల్!

OG Movie: అభిమానించే హీరోకి హిట్ వస్తే.. ఆ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ఆనందలోనే ఉన్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్‌కు బ్లాక్ బస్టర్ సక్సెస్ రావడంతో, అభిమానులు ఇంకా సక్సెస్ మూడ్‌లోనే ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం రూ. 310 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని అభిమానులు ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు చూస్తే, ఎలా వస్తాయిరా బాబు.. ఇలాంటి థాట్స్ అని ప్రతి ఒక్కరూ అనుకోకుండా ఉండలేరు. అలా ఎరేంజ్‌మెంట్స్ చేశారు అభిమానులు. అందుకే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అసలీ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..

Also Read- Akhanda 2: హిందీలో పరిస్థితేంటి? ఆ హీరోల సరసన బాలయ్య నిలుస్తాడా?

పక్కా కల్ట్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ అనగానే గుర్తొచ్చేది ఆయన మంచితనం, దాన గుణం, వ్యక్తిత్వం వంటివే కాకుండా, ఎర్ర తువాలు కూడా. అవును శ్రమ జీవికి చిహ్నంగా వినియోగించే ఎర్ర తువాలుతో ‘ఓజీ’ సినిమా ఆడుతున్న థియేటర్ మొత్తాన్ని డెకరేట్ చేశారు అభిమానులు. ఇదొక్కడో కాదు.. పార్వతీపురంలో అని ఈ వీడియోలో క్లారిటీగా చెప్పారు. అంతేకాదు, డీ సెంటర్స్ మాస్‌ని ఏ అండ్ బి సెంటర్స్ చూసి నేర్చుకోండి అంటూ ఈ వీడియోకు ట్యాగ్ చేయడం విశేషం. ఈ వీడియోను షేర్ చేస్తున్న అభిమానులు.. అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి మామ? ట్రూ ఫ్యాన్స్ అనిపించుకున్నారుగా? అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఈ వీడియోను లైక్ చేస్తూ.. బీభత్సంగా షేర్ చేస్తున్నారు. ఈ డెకరేషన్‌తో పార్వతీపురం అభిమానులు.. పక్కా కల్ట్ ఫ్యాన్స్ అని అనిపించుకున్నారు.

Also Read- Tollywood: డబ్బులిచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటూ.. మళ్లీ ఈ సారీలు చెప్పించుకోవడం ఏంటి?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్

‘ఓజీ’ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న అధికారికంగా విడుదలైంది. సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రత్యేక షోలు పడటంతో.. మొదటి వారంలోనే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ నేపథ్య సంగీతంతో పాటు.. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా పనితనం ప్రధాన హైలెట్స్‌గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా నిర్మాణంలో సుజీత్, థమన్‌ల ఉత్సాహం చూసి, వారి కోసం, అలాగే అభిమానుల కోసం సీక్వెల్‌ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం