Sujeeth ( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్ కామెంట్స్ వైరల్… అంతమాటన్నాడేంటి?

Sujeeth: పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఓజీ’ యాక్షన్ ఓరియంటెడ్ జోనర్‌లో రావడంతో ఈ సారి రికార్డులు బద్దలవుతాయని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. దాంట్లో ‘ఓజీ’ డైరెక్టర్ సుజిత్ ‘ఈ సారి ‘ఓజీ’తో రికార్డులన్నీ దుల్లగొడుతున్నాం.. ఎవడు వస్తాడో రండి’ అంటూ చేసిన వ్యాఖ్యల దుమారం రేపుతున్నాయి. దసరా కానుకగా ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. కాగా ఇదే రోజున నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన ‘అఖండా 2’ కూడా అదే రోజున విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ కూడా సుమారుగా అదే తేదీల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంలో సుజిత్ చేసిన వ్యా్ఖ్యలు ఎవరిని ఉద్దేసించి అన్నాడు అన్న దానిలో చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ సందిగ్ధంలో ఉన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఇదంతా ఏఐ తో చేశారంటూ నిజంగా సుజిత్ అన్న మాటలు కాదంటూ కొట్టిపడేస్తున్నారు.

Also Read – Chandrababu: రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు?

‘ఓజీ’ సినిమా పూర్తయిన సంర్భంగా నిర్మాతలు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు పవన్ ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో ఆ పోస్టర్లో ఉందంటూ తెగ సంబరపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ పోస్టర్‌ ను చూస్తుంటే.. అప్పట్లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపోందిన ‘పంజా’ సినిమా గుర్తుకు తెచ్చేలా పోస్టర్ ఉందని నెటిజన్లు అంటున్నారు. పవన్ సీరియస్ లుక్‌తో వర్షంలో పిస్టోల్ పట్టుకుని కారులో నుంచే ఎవరికో గురిపెట్టినట్టు ఉంది పోస్టర్. దీనిని చూసిన అభిమానులు పవన ఇండస్ట్రీ రికార్డులకు గురిపెట్టాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అంటే ఈ దెబ్బతో పవన్ మరోసారి బాక్సాఫీసు దగ్గర తన మేనియా చూపించబోతున్నారని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. పోస్టర్ లో పవర్ స్టార్ కమిట్మెంట్ చూసిన అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. దీనికి తోడు ‘సాహో’ వంటి భారీ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read – Mayasabha: ‘మయసభ’ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్.. వారికోసమేనా?

ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అసలే యాక్షన్ మూవీ అందులో థమన్ సంగీతం అందించడంతో ధియేటర్లు బద్దలు కానున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం, నాణ్యమైన నిర్మాణ విలువలు ఉండటంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఖాయమంటూ సినీ పెద్దలు కితాబిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!