Allu Aravind
ఎంటర్‌టైన్మెంట్

Allu Aravind: ఈడీ విచారణ.. అసలు విషయమేంటో చెప్పేసిన అల్లు అరవింద్..!

Allu Aravind: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరుకావడంతో ఆయనపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అసలు ఏం జరిగిందో, ఏంటో కూడా తెలుసుకోకుండా 100 కోట్ల స్కామ్‌లో నిర్మాత అల్లు అరవింద్ అంటూ వార్తలు వైరల్ చేశారు. ఆయన ఈడీ విచారణకు వెళ్లిన విషయం నిజమే. అది ఆయనే స్వయంగా తెలిపారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఆయన చెబుతున్న ప్రకారం.. ఇందులో ఆయన మిస్టేక్ ఏం లేదు. ఒక మైనర్ దగ్గర వివాదాల్లో ఉన్న ప్రాపర్టీని కొనడమే ఆయన చేసిన మిస్టేక్. కాకపోతే, డ్యాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండటంతో.. అల్లు అరవింద్‌ను జస్ట్ పిలిచి, ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను మాత్రమే ఈడీ అడిగిందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

Also Read- Actress Lavanya: లావణ్య మెడకు చుట్టుకున్న మరో వ్యవహారం.. ఫోన్ స్విచాఫ్

అసలు విషయం ఏమిటంటే..
2017-19 మధ్యకాలంలో హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ (Ramakrishna Electronics), రామకృష్ణ టెలిట్రానిక్స్ (Ramakrishna Teletronics) సంస్థలు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India) నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకున్నాయి. ఈ సంస్థలు రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వాటి డైరెక్టర్లు వి. రాఘవేంద్రరావు, వి. రవి కుమార్ తదితరులపై బెంగళూరులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. ఇక విచారణలో భాగంగా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్‌లకు సంబంధించిన కార్యాలయాలు, సంస్థ డైరెక్టర్లు అయిన వి. రాఘవేంద్రరావు, వి. రవి కుమార్ ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలిస్తున్న క్రమంలో అల్లు అరవింద్ పేరు కూడా తెరపైకి రావడంతో.. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్‌కు చెందిన సంస్థల మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అందుకే అల్లు అరవింద్‌ని పిలిచి విచారించారు.

Also Read- Pawan Kalyan Sons: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్!

ఈ విచారణపై వివరణ ఇస్తూ అల్లు అరవింద్ ఏమన్నారంటే.. ‘‘నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్టీ కూడా ఉంది. కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లెమ్ ఏదో వుంది.. అతను బ్యాంకు లోన్ తీసుకొని కట్టలేదు. అతనికి ఈడీ ఎంక్వయిరీ వుంది. ఆ ఈడీ ఎంక్వయిరీ‌లో అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో నా పేరు ఉన్నపుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యత గల సిటిజన్‌గా వెళ్ళాలి కదా! అందుకే నేను వెళ్ళి వివరణ ఇచ్చాను. అంతే, దీనిపై మీడియా రాద్దాంతం చేస్తుంది. వాళ్ళు ఎంక్వయిరీ అడిగితే వెళ్లాను..అంతకు మించి ఏమీ లేదు.. నేను ఏ స్కామ్‌లో లేను’’ అని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?