Swayambhu Movie: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ఈ సినిమా మహా శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 10, 2026న విడుదల చేయనున్నారు. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో సాగే భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) చాలా కీలకం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉండాలని దర్శకుడు భరత్ కృష్ణమాచారి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం తీసుకుంటున్నారట. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా 8 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా విదేశీ భాషలు) విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలంటే ప్రమోషన్స్ ఇతర పనులకు మరింత సమయం అవసరమని మేకర్స్ భావించారు. ఫిబ్రవరి కంటే మార్చి చివర లేదా ఏప్రిల్‌లో విడుదల చేస్తే ఉగాది సెలవులు, సమ్మర్ వెకేషన్ కలిసి వస్తాయని, ఇది సినిమా వసూళ్లకు ప్లస్ అవుతుందని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమ్మర్ సీజన్ కు బడా స్టార్ల్ మొత్తం క్యూ కట్టుకున్నారు. బాలీవుడ్, సాండిల్ వుడ్, నుంచి పాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా సమ్మర్ కు రెడీ అవుతున్నారు. ఇంత టైట్ రిలీజ్ ల వల్ల ఈ సినిమా అప్పుడు కూడా విడుదల అవుతుందో లేదో చూడాలి మరి.
Read also-Mouni Roy: బాలీవుడ్ నటికి ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం.. వద్దన్నా చేతులు వేస్తూ..

