Niharika and Yadhu Vamsi
ఎంటర్‌టైన్మెంట్

Niharika: మెగా డాటర్ స్పీడ్ పెంచింది.. హిట్ టీమ్‌తో రిపీట్!

Niharika: మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika) స్పీడ్ పెంచింది. స్పీడ్ పెంచింది అనగానే.. హీరోయిన్‌గా అనుకుంటారేమో, కానే కాదు. నిర్మాతగా ఇకపై వరుస చిత్రాలు చేసేందుకు ఆమె రెడీ అవుతోంది. నిర్మాతగా తను నిర్మించిన మొదటి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) బ్లాక్ బస్టర్ సక్సెస్ అవడంతో పాటు, అధిక లాభాలను అలాగే పలు అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ ఉత్సాహంలో నిహారిక మంచి సబ్జెక్ట్స్‌ని పట్టుకుని, నిర్మాతగా స్ట్రాంగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా నిహారిక నిర్మించే మరో చిత్రానికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత సంతోష్ శోభన్‌తో రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నిహారిక, ఇప్పుడు మూడో ప్రాజెక్ట్ కోసం మరోసారి తన హిట్ టీమ్‌ని రిపీట్ చేస్తోంది. అవును.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీతో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక మరో సినిమాను చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా మొదలైనట్లుగా సమాచారం.

Also Read- Bigg Boss Telugu 9: డే 31 ఎక్స్‌ప్లోజివ్ టాస్క్స్.. తనూజ, కళ్యాణ్ పడేశారు.. సుమన్ శెట్టి ఆర్ట్ పీక్స్!

త్వరలోనే అనౌన్స్‌మెంట్

అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిహారిక ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపుదిద్దుకుంటున్న సినిమాపై నిహారిక కొణిదెల పూర్తి దృష్టి పెట్టారని, ఇది ఓ కొలిక్కి రాగానే ప్రొడక్షన్ నెం.3 అనౌన్స్‌మెంట్ రానుందనేటా టాక్ మొదలైంది. ప్రస్తుతం చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తుండగా.. ఈ చిత్రానికి కథను మానస శర్మ సిద్ధం చేస్తే.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ మాత్రం మానస శర్మ, మహేష్ ఉప్పాల కలిసి అందిస్తున్నారు. ఫ్యాంటసీ, కామెడీ జోనర్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇదిలా ఉంటే, నిహారిక నిర్మించిన మొదటి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ జాతీయ, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపును రాబట్టుకున్న విషయం తెలిసిందే.

Also Read- Peddi Update: పూణేలో జాన్వీతో రామ్ చరణ్ రొమాన్స్.. తాజా అప్డేట్ ఇదే!

‘కమిటీ కుర్రోళ్లు’ విశేషాలివే..

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాతో 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్లు తెలుగు సినిమాకు ప‌రిచ‌యమయ్యారు. సుమారు రూ.9 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రిక‌ల్‌గా రూ.18.5 కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అలాగే నాన్ థియేట్రిక‌ల్‌గా రూ.6 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా అయితే ఈ సినిమా రూ.24.5 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడిదే కాంబోలో మరో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే నిహారిక చాలా ప్లాన్డ్‌గా సినిమాలు నిర్మిస్తుందనేది మాత్రం.. ఆమె జర్నీని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, హిట్ రాగానే వరసగా సినిమాలు చేయాలని నిర్మాతలు భావిస్తారు. కానీ, నిహారిక మాత్రం చాలా జాగ్రత్తగా తను నిర్మించే సినిమాల లైనప్‌ని రెడీ చేసుకుంటోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!