Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిధి అగర్వాల్ చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని బ్రదర్స్ ఇద్దరితో నటించి మంచి విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమా హిట్ అందించినా అవకాశాలు మాత్రం అందుకోలేక పోయింది. అప్పటి నుంచి తెలుగులో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటించింది. కెరీర్‌లో చాలా గ్యాప్ తర్వాత రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకుంది అమ్మడు. ఈ సినిమా జూలై 24 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రచారాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా నిధి వీలైనప్పుడల్లా అభిమానులతో ఇంటరాక్షన్ అవుతూ వస్తుంది. ఇలా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయినపుడు అభిమాని నుంచి ఓ షాకింగ్ కామెంట్ వచ్చింది. దానికి నిధి సీరియస్ అవకుండా కూల్‌గా సమాధానం ఇచ్చింది.
Also Read- Viral Video: రీల్స్ పిచ్చితో కూతురు ప్రాణాలు పణంగా పెట్టిన తండ్రి.. జస్ట్ మిస్!
అసలు ఏం జరిగింది అంటే… ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ప్రమోషన్‌లో భాగంగా నిధి అగర్వాల్ ‘ఆస్క్ నిధి’ అంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. అందులో ఒక అభిమాని ‘బంగారం మీ అమ్మ గారి నంబర్ ఇస్తావా.. మన పెళ్లి గురించి కొంచెం ఆమెతో మాట్లాడేది ఉంది. ప్లీజ్ ఇవ్వచ్చుగా.. అంటూ మెసేజ్ పెట్టాడు. దానిని చదివిన నిధి అతడిపై అసలు సీరియస్ అవ్వలేదు. ‘అవునా, నాటీ!’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ సరదా కామెంట్లు చదివిన నెటిజన్లు నిధి అగర్వాల్ సరదాతనానికి ఫిదా అవుతున్నారు.
Also Read- Regina Cassandra: పెళ్లెప్పుడు అన్నందుకు.. అంత సీరియస్సా?
అభిమానులు ఇలాంటి కామెంట్లు పెట్టినపుడు కొంత మంది హీరోయిన్లు సీరియస్‌గా తీసుకుంటారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం వీటిని సరదాగా తీసుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తున్నందుకు ఆయన అభిమానులు తనను ఎంతో ఆదరిస్తున్నారని, ఇలాంటి ప్రేమ తనకు ఎక్కడా దొరకదని చెప్పుకొచ్చారు. నిధి అగర్వాల్ ఈ ఏడాది ఇద్దరు బడా హీరోలతో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ చేస్తుండగా.. ఈ సినిమా జూన్ 24 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్ అయిన ‘ది రాజాసాబ్’(The Raja Saab)లో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా ఎస్ఎస్ ధమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కూడా ఇదే ఏడాది డిసెంబర్ 5 న విడుదలవనుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం నిధి అగర్వాల్ దశ తిరిగినట్లు అవుతుందని, టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల సరసకు చేరుకుంటుందని సినిమా పెద్దలు కితాబిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.