Sekhar Kammula: టాలీవుడ్‌లో ఉన్న అగ్ర దర్శకుల్లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఒకరు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు చాలా సింపుల్‌గా, నేచురల్‌గా ఉంటాయనే విషయం తెలియంది కాదు. ఆయన వ్యక్తిత్వం కూడా అదే విధంగా ఉంటుంది. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘కుబేర’ చిత్రం జూన్ 20న రిలీజై మంచి విజయం కూడా అందుకుంది. ఇప్పటి వరకు తాను రూపొందించిన సినిమాలకు భిన్నంగా కాస్త కమర్షియల్ యాంగిల్ జోడించి ‘కుబేర’ (Kubera) సినిమా తీశారు శేఖర్ కమ్ముల. ఇందులో ‘మన్మథుడు’ నాగార్జున, తమిళ స్టార్ యాక్టర్ ధనుష్ కలిసి నటించారు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఇక బిచ్చగాడి పాత్రలో నటించిన ధనుష్ ఆ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంపై శేఖర్ కమ్ముల తన మననులో మాటలు బయట పెట్టారు.
Also Read – Sehwag Son: సెహ్వాగ్ పెద్ద కొడుకు సంచలనం.. వేలంలో భారీ ధర
ఇప్పటి వరకు తన 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో 10 సినిమాలు మాత్రమే తీశానన్నారు. కానీ ఒక్క సినిమా విషయంలో కూడా ప్రేక్షకుల నుంచి తనకు తిట్లు పడలేదని చెప్పుకొచ్చారు. 25 ఏళ్లలో ఇప్పటికీ అదే పద్మారావు నగర్లో సింపుల్‌గా ఉండటానికి కారణం పొజిషన్ ఆడియన్స్ ఇచ్చిందే అన్నారు. అందువల్ల.. గ్రౌండెడ్‌గా ఉండగలిగానని నమ్ముతానన్నారు. ట్రెండ్స్‌కి తగ్గట్లుగా మారిపోయే మనిషిని కాదని, కానీ ఇప్పుడు ‘కుబేర’ లాంటి కథ కోసం కొన్ని కమర్షియల్ అంశాలు తీసుకోవాల్సి వచ్చిందని, అది తనకు ఒక కొత్త ప్రయోగమన్నారు. ‘కుబేర’ అనేది ఇప్పటివరకు శేఖర్ కమ్ముల తీసిన సినిమాలకు పూర్తి విరుద్ధమే అయినా, కథ టచ్ చేయడం వల్లే ఈ సినిమా తీయగలిగానన్నారు. ప్రేక్షకులకు తనపై ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకం వల్లే థియేటర్‌కు వస్తున్నారన్నారు. దానిని ఎప్పటికీ ఒమ్ము చేయనని చెప్పుకొచ్చారు. తన సినిమాలు ఆదరించే ప్రేక్షకులు ఉండటం ఎంతో గర్వంగా భావిస్తున్నానన్నారు.
Also Read –Falcon Scam: రూ. 4,215 కోట్ల భారీ మోసం వెలుగులోకి!
శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు పది సినిమాలకు దర్శకత్వం వహించారు. అందుకో కొన్నింటికి నిర్మాతగా, రచయితగా, కొరియోగ్రాఫర్‌గా కూడా వ్యవహరించారు. ‘ఆవకాయ్ బిర్యాని’ అనే సినిమాకు నిర్మాతగా మాత్రమే ఉన్నారు. ‘గోదావరి’ వంటి సినిమాకు శేఖర్ కమ్ములను నంది అవార్డులు కూడా వరించాయి. మన చూట్టూ జరిగే కథలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆయన సినిమాలు చూస్తున్నపుడు అంతా మన పక్కనే జరుగుతున్న ఫీల్ వస్తుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఈ దర్శకుడిపై ఎటువంటి ప్రశంసలు కురిపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతా స్టేజ్‌పైనే చూశారు. చిరంజీవి అంటే కమ్ములకు అంత ఇష్టం మరి. తన 25 సంవత్సరాల సినీ జర్నీని చిరంజీవితో కలిసి ఎంజాయ్ చేయడం.. శేఖర్ కమ్ముల ఎప్పటికీ మరిచిపోలేనని సోషల మీడియా వేదికగా తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.