Tollywood Actor: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh), తెలుగు చిత్ర పరిశ్రమలో (Tollywood) హీరోగా పరిచయం అయ్యాడు. అతని తొలి చిత్రం “స్వాతి ముత్యం” 2022లో , దీనికి లక్ష్మణ్ కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గణేష్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన గణేష్, తన అన్నయ్య సాయి శ్రీనివాస్ లాగే సినీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు.
Also Read: Mahesh Kumar Goud: ఈసీ తీరుపై న్యాయ పోరాటం.. అప్రజాస్వామిక చర్యలని టీపీసీసీ చీఫ్ ఫైర్
తాజా సమాచారం ప్రకారం, గణేష్ నటిస్తున్న కొత్త సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి పవన్ సదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే, ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
బెల్లంకొండ సురేష్, గణేష్ సినీ కెరీర్ ఇంకా స్థిరపడాల్సి ఉంది, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం గణేష్ తన నటనా ప్రయాణంపై దృష్టి సారించి, తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నాడు. అయితే, ఇటీవలే ఓ వీడియో అతని నడిచిన విధానం చూసి బాగా ట్రోల్ చేశారు. అతను సాధారణ నడక నడిచిన కూడా ఎక్కడో తేడా కొడుతోందంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు
Also Read: Mynampally Hanumantha Rao: కేటీఆర్ హరీష్ రావులకు కీలుబొమ్మ ఆయనే.. మైనంపల్లి హనుమంతరావు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినీ కెరీర్
సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) సినీ కెరీర్ కూడా అంతంత మాత్రంగా సాగుతుంది. స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, అల్లుడు అదుర్స్ వంటి తెలుగు మూవీస్ లో నటించాడు. అతను తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. అయినా సక్సెస్ కాలేక పోయాడు. కానీ ఈ చిత్రం అక్కడ విజయం సాధించలేదు.తాజాగా, అతను “భైరవం” అనే మల్టీ-స్టారర్ చిత్రంలో నటించాడు. దీనిలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం మే 30, 2025న రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అంతేకాకుండా, అతను టైసన్ నాయుడు, హైందవ, కిష్కిందపురి వంటి అప్ కమింగ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కిష్కిందపురి చిత్రం ఒక హారర్-మిస్టరీ శైలిలో ఉండనుంది. ఈ చిత్రంలో సాయి శ్రీనివాసన్ సరసన అనుపమ పరమేశ్వరన్ కూడా నటిస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
