Netflix Telugu: పాన్ ఇండియా సినిమాలకు అన్నీ దాదాపు ఒకే చోట స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ప్లిక్స్. తాజాగా ఈ ఏడాది ‘నెట్‌ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ అవ్వబోయే సినిమాల లిస్ట్ విడుదల అయింది. ఈ మకర సంక్రాంతికి నెట్‌ఫ్లిక్స్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన తెలుగు సినిమా స్లేట్‌ను అనౌన్స్ చేసింది. బిగ్ స్క్రీన్ విజువల్ స్పెక్టకిల్స్‌తో పాటు స్టార్‌లు నడిపించే పవర్ ఫుల్ కథలతో రూపొందిన ఈ లైనప్, ముందుగా థియేటర్లలో విడుదలై, అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ స్లేట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ తెలుగు సినిమాపై తన నిరంతర నిబద్ధతను మరోసారి స్పష్టం చేస్తూ, దాని విస్తృత స్థాయి, కథల వైవిధ్యం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంపాక్ట్ ను ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది.
Read also-Tiger Of Martial Arts: పవన్ కళ్యాణ్, విద్యుత్ జమ్వాల్ మధ్య ఆసక్తికర సంభాషణ!
మార్కీ స్టార్‌లతో పాటు ఇప్పటివరకు చూడని కొత్త కథలతో నిండిన 2026 లైనప్, సినిమాను అత్యంత ఉత్కంఠభరితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. హై-వోల్టేజ్ డ్రామాకు నాంది పలుకుతూ, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ అలరించనున్నారు. సూపర్ సక్సెస్‌ఫుల్ 2025 తర్వాత, నాని మరింత డార్క్, గ్రిప్పింగ్ జోన్లోకి అడుగుపెట్టి ది పారడైజ్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ పీరియాడిక్-యాక్షన్ చిత్రం VD14 తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెట్‌ఫ్లిక్స్ అభిమాన హీరో వెంకటేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉత్కంఠభరితమైన ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్: 47 తో వస్తుండగా, రామ్ చరణ్ జాన్వి కపూర్‌తో కలిసి ‘పెద్ది’తో అద్భుతంగా ఉన్న ఈ స్లేట్‌కు మరింత జోష్‌ను జోడిస్తున్నారు.
Read also-Kattalan: ‘కటాలన్’ సెకండ్ లుక్ వచ్చేసింది.. ఊర మాస్ అవతార్!
నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ – కంటెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా తన విస్తృత స్థాయి, అంబిషస్ కథనాలు, బలమైన భావోద్వేగ అనుసంధానంతో అత్యంత నిబద్ధత గల ప్రేక్షకులను కలిగి ఉంది. 2026 పెద్ద మైన్‌స్ట్రీమ్ ఎంటర్టైనర్ల నుంచి డెప్త్, క్యారెక్టర్ బేస్డ్ చిత్రాల వరకూ గొప్ప కథల కనిపించడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. Pushpa 2, HIT 3, OG, Court వంటి చిత్రాలు ఈ వైవిధ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ లైనప్ లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నాని ‘ది ప్యారడైజ్’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశములో ఒక తార’ రోషన్ ‘ఛాంపియన్’, ఫహద్ ఫాసిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ‘విశ్వక్ సేన్’ ఫంకీ , సంగీత్ శోభన్ ‘రాకాస’ శర్వానంద్ ‘బైకర్’, విజయ్ దేవరకొండ ‘VD14’ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ సంఖ్య: 47’, రామ్ చరణ్ ‘పెద్ది’ తదితర సినిమా లు నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానున్నయి.

