NBK111: నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అందుకే వీరి తదుపరి చిత్రం NBK111 మీద అనౌన్స్‌మెంట్ రోజే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా అటకెక్కిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’కు లైన్ క్లియర్ అయినట్టేనా? ఆ ఐకానిక్ డేట్‌కేనా రిలీజ్?
అఖండ 2 ఎఫెక్ట్ పడిందా?
రీసెంట్‌గా విడుదలైన ‘అఖండ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం బాలయ్య తదుపరి సినిమాలపై ప్రభావం చూపిస్తోందని టాలీవుడ్ టాక్. నిజానికి NBK111ని ఒక భారీ చారిత్రక నేపథ్యం ఉన్న కథతో, సుమారు రూ. 170 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారీ బడ్జెట్‌ను పెట్టడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సంక్రాంతికి కనీసం ఒక విష్ పోస్టర్ కానీ, అప్‌డేట్ కానీ రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గోపీచంద్ మలినేని సిద్ధం చేసిన చారిత్రక కథలో బాలయ్య ఒక పవర్ ఫుల్ రాజు పాత్రలో కనిపించాల్సి ఉంది. దీనికోసం భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్ అవసరం. అయితే మార్కెట్ లెక్కల ప్రకారం ఈ బడ్జెట్ రిస్క్ అని భావిస్తున్న నిర్మాతలు, అదే కాంబినేషన్‌లో బడ్జెట్ తగ్గించేలా మరో కథతో రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనివల్ల షూటింగ్ పనులు కూడా ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
Also Read- Dhanush and Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!
నయనతార కూడా తప్పుకుందా?
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించాల్సి ఉంది. అయితే ప్రాజెక్ట్ లేట్ అవ్వడం లేదా బడ్జెట్ కోతల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. కేవలం బడ్జెట్ ఇబ్బందులే కాకుండా.. బాలయ్య, గోపీచంద్ మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. సంక్రాంతికి బాలయ్య బాబు నుండి ఏదో ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌లాగే, నందమూరి ఫ్యాన్స్ కూడా తమ హీరో నుంచి ఒక మాస్ అప్‌డేట్ కోరుకుంటున్నారు. ఈ సినిమా ఆగిపోయిందని కొందరు అంటున్నా, మరికొందరు మాత్రం గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఒక పక్కా లోకల్ మాస్ కథను రెడీ చేస్తున్నారని, త్వరలోనే NBK111 కొత్త రూపంలో వస్తుందని నమ్ముతున్నారు. చూడాలి మరి, నటసింహం గర్జన మళ్ళీ ఎప్పుడు వినిపిస్తుందో! ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

