The Paradise Update: మోహన్ బాబు స్టన్నింగ్ లుక్ రిలీజ్..
mohan babu( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Paradise Update: మోహన్ బాబు స్టన్నింగ్ లుక్ రిలీజ్.. ఏ సినిమా అంటే?

The Paradise Update: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు నిర్మాతలు. అందులో ఉన్నది డైలాగ్ కింగ్ మోహన్ బాబు. ఊర మాస్ లుక్ తో ఉన్న ఈ పోస్టర్ చూసిన మోహన్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరో నాని ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో, SLV సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్స్ సినిమా రేంజ్ ఏంటో తెలియజేస్తున్నాయి. మేకర్స్ బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్‌ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి.

Read also-Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ దసరాకి నో ముక్కా, నో చుక్కా..!

శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ పాత్రలో కనిపించనున్నారు. దీనిని చూస్తుంటే మోహన్ బాబు విలన్ రోల్ లో కనిపించబోతున్నారు. ఆ మాస్ లుక్ మోహన్ బాబును మళ్లీ పాతరోజుల్లోకి తీసుకెళ్తాయనిపిస్తుంది. స్టైలిష్ విలనిజాన్ని ఈ లుక్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు చూపించనున్నారు. అసలే శ్రీకాంత్ ఓదెల సినిమా మాస్ ఎలిమెంట్స్ దండిగా ఉంటాయి. అంటే మోహన్ బాబుని మరో స్థాయిలో చూపించబోతున్నాడు దర్శకుడు.  రాయల్ సింహాసనం మీద కూర్చొని మోహన్ బాబు మరో సారి తన సత్తా చూపించబోతున్నారు. ఈ ఒక్క పోస్టర్ సినిమాలో విలనిజానికి ఏ స్థాయి ఉందో చూపిస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పేనిష్ భాషల్లో మార్చి 26, 2026న విడుదల కానుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరికీ రిచ్ అవుతుంది.

Read also-Puri Sethupathi movie: పూరి, సేతుపతి సినిమా నుంచి మరో అప్డేట్.. టీజర్ లాంచ్ ఎక్కడంటే?

ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాను ఊర మాస్ రేంజ్ లో దర్శకుడు రూపొందించాడని తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’ యాక్షన్ థ్రిల్లర్, శ్రీకాంత్ ఒడెలా డైరెక్షన్‌లో 1980లలో ఒక అస్పృశ్య కులానికి చెందిన గిరిజన తెగకు చెందిన వారు వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, పౌరసత్వం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఇక్కడ నాని ‘జడల్’ పేరుతో ఒక అసాధారణ నాయకుడిగా మారి వారిని ఆదేశిస్తాడు. ఈ పీరియడ్ యాక్షన్-డ్రామా భారతీయ ‘మ్యాడ్ మ్యాక్స్’లా ఉంటుందని చెబుతున్నారు. మోహన్ బాబు విలన్ పాత్రల్లో కనిపిస్తారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Just In

01

Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!

Ustaad Bhagat Singh: మామా మరో పోస్టర్ వదిలారు.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Hey Bhagawan: ‘హే భగవాన్’ స్పెషల్ వీడియో చూశారా.. నవ్వకుండా ఉండలేరు!

Govt Employees: ఉద్యోగ సంఘాలకు కొత్త ఏడాది గుడ్ న్యూస్!.. సీఎం రేవంత్ కీలక సందేశం?

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి