Natural Star Nani: నేచురల్ స్టార్ నాని బీస్ట్ మోడ్‌లోకి మారిపోయారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవడానికి కారణం లేకపోలేదు. ఈ ఫొటో నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) టీమ్ విడుదల చేసింది. ఇందులో నాని బీస్ట్ మోడ్ అవతార్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇక ఈ ఫోటో ఆ చిత్ర టీమ్ విడుదల చేయడానికి కారణం ఏమిటంటే.. నాని ఇండస్ట్రీలో 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ది ప్యారడైజ్’ ఈ లుక్‌ను విడుదల చేసింది. రీసెంట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) కూడా బీస్ట్ మోడ్‌లో ఇలానే కనిపించారు. ఆయన ఫొటో కూడా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు నాని కూడా సేమ్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఫెరోషియస్ అవతార్‌లో
నిజంగానే ఇందులో నాని (Natural Star Nani) ఇప్పటి వరకు కనిపించని ఫెరోషియస్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. కండలు తిరిగిన దేహంతో ఆయనను ఇలా చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫ్యాన్స్ ఆనందం చేస్తూ.. ఈ పిక్‌ని షేర్ చేస్తుండటంతో.. ఈ పిక్ వైరల్ అవుతోంది. ‘ది ప్యారడైజ్’లో నాని నెవర్ బిఫోర్ ‘జడల్’ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం జిమ్‌లో ఇంటెన్స్‌గా వర్కవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రా స్టేట్మెంట్, గ్లింప్స్ వీడియోలు నేషనల్ వైడ్‌గా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలియంది కాదు. అందుకే ఈ సినిమాను గ్లోబల్ రేంజ్‌తో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
పాన్-వరల్డ్ మూవీ
గ్లోబల్ వైడ్ ఈ సినిమాను విడుదల చేసేలా హాలీవుడ్‌లోని Connekkt Mob Sceneతో ‘ది ప్యారడైజ్’ టీమ్ కొలాబరేట్ అవుతోంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌ని రీజనల్ సినిమాలా కాకుండా, పాన్-వరల్డ్ మూవీలా ట్రీట్ చేస్తున్నారు. అగ్రెసివ్ ప్రమోషన్స్‌తో అన్ని లాంగ్వేజెస్‌లో, మార్కెట్స్‌లో, ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగు హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్స్‌లో జరుగుతోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు