Natural Star Nani: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) రేంజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, నిర్మాతగా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. టాలీవుడ్‌లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం అటు హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెస్ ఉన్న హీరో ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు నాని రేంజ్ హాలీవుడ్‌కు చేరుతుంది. అదెలా అనుకుంటున్నారు కదా. నాని హీరోగా రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చేయని ఇంటెన్స్ పాత్రను నాని పోషిస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
Also Read- 50 Years of NBK: బాలయ్య చేసిన ఆ పాత్ర ఎన్‌టి రామారావు కూడా చేరలేరేమో.. ఈ మాట అంది ఎవరో తెలుసా?
హాలీవుడ్ సంస్థతో కొలాబరేషన్
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్‌తో అంచనాలని తారా స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాను గ్లోబల్ సినిమా విజన్‌తో గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌తోనే మేకర్స్‌కి ఉన్న యూనివర్సల్ విజన్ ఏంటనేది అందరికీ అర్థమైంది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, బోల్డ్ ప్రమోషన్స్ అన్నీ కూడా గ్లోబల్ మూవీ దిశగానే సాగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ ఏమిటంటే.. ‘ది ప్యారడైజ్’ టీం హాలీవుడ్‌లోని ConnekktMobScene ఎగ్జిక్యూటివ్ VP ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటిని కలిసి.. ఈ సినిమా కోసం కొలాబరేషన్ అయ్యేలా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ అడుగు మేకర్స్ ఊహిస్తున్న ఇంటర్నేషనల్ ప్లాన్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా ప్రజెంట్ చేస్తోందని నమ్ముతున్నారు.
Also Read- Telugu Director: చెప్పుతో కొట్టుకుంటూ.. భోరున విలపించిన తెలుగు దర్శకుడు.. వీడియో వైరల్!
హాలీవుడ్ నటుడు
మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌ని రీజనల్ సినిమాలా కాకుండా, పాన్-వరల్డ్ మూవీలానే మేకర్స్ ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఆగ్రెసివ్ ప్రమోషన్స్‌తో అన్ని లాంగ్వేజెస్‌లో, మార్కెట్స్‌లో, ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. 2026 మార్చిలో వరల్డ్ వైడ్‌గా కనీ, వినీ ఎరుగని రీతిలో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా చెబుతుండటం విశేషం. ఇంటర్నేషనల్ వెర్షన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి, ఇండియాలో భారీ సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి కూడా టీం చర్చలు జరుపుతోంది. ఇది ప్రాజెక్ట్‌కి ఇంకో గ్లోబల్ డైమెన్షన్‌ని సూచిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 26 మార్చి 2026న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు