Mrunal Thakur
ఎంటర్‌టైన్మెంట్

Mrunal Thakur: ఆ రొమాంటిక్ సాంగ్.. నా ఫేవరెట్: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇక అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత నానికి జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో తన ఫేవరెట్ సాంగ్ అంటూ వీడియో పోస్ట్ చేసింది.

అయితే తన అభిమానం హీరోలు, హీరోయిన్స్ ఇష్టాఇష్టాలను తెలుసుకోవడానికి అభిమానులు తహలాట పడుతూ ఉంటారు. సాధారంగా సినీ సెలబ్రిటీస్ ఇష్టాఇష్టాలను బయటికి పంచుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ బయటపెడితే ఎలా రెస్పాండ్ అవుతారో.. ఏ విధంగా ట్రోల్స్ చేస్తారో అని బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం మనసులోని మాటలు బయటికి చెబుతూ ఉంటారు. ఇలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు అని చెప్పవచ్చు. ఏ విషయమైన సోషల్ మీడియా వేదికగా మృణాల్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన పర్సనల్ విషయాలతో పాటు ఇష్టాఇష్టాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని ‘నానా హైరానా’ పాట తన ఫేవరెట్ సాంగ్ అంటూ వెల్లడించింది. హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్.. తనకు ఇటీవల వచ్చిన పాటల్లో చాలా ఇష్టమని తెలిపింది. తమిళ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోలేపోయింది. వరల్డ్ వైడ్‌గా కేవలం రూ.178 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.

Also Read: ఛీఛీ.. పుట్టబోయే పిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారు: ప్రియమణి

మరోవైపు వరుస సినిమాలు చేస్తూ మృణాల్ ఠాకూర్ దూసుకెళ్తోంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’లో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఈ బ్యూటీ ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. మూవీ షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికి మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతూ ఉంటుంది.

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?