Nagabandham: యంగ్ హీరో విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నాగబంధం’. ‘పెద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్‌తో ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినట్లుగా మేకర్స్ ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఈ సినిమా ఆధ్యాత్మికత, యాక్షన్, విజువల్ స్ప్లెండర్ మిళితమైన ఓ మ్యాసీవ్ సినిమాటిక్ జర్నీ అని, అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారని టీమ్ చెబుతోంది. బడ్జెట్ పరిమితులూ లేకుండా, ప్రేక్షకులను అబ్బురపరిచే సెట్‌లు, విజువల్స్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. అదేమిటంటే..
శివాలయం సెట్‌లో ‘ఓం వీర నాగ’
ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలవనున్న డివోషనల్ సాంగ్ ‘ఓం వీర నాగ’ (Om Veera Naga)కు పాపులర్ బాలీవుడ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో అత్యద్భుతంగా నిర్మించిన శివాలయం సెట్‌లో ఈ పాటను షూట్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సెట్‌ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ అద్భుతంగా రూపొందించారని, అభే అండ్ జునైద్ కుమార్ గూస్‌బంప్స్ తెప్పించే సాంగ్ కంపోజ్ చేశారని తెలిపారు. అలాగే ఈ పాటకు దైవత్వం ఉట్టిపడేలా శ్రీ హర్ష లిరిక్స్ ఉంటాయని పేర్కొన్నారు. విరాట్ కర్ణపై గణేశ్ ఆచార్య ఈ సాంగ్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారని నిర్మాతలు వెల్లడించారు. ఈ పాట కార్తీక మాసంలో చిత్రీకరించడం ఆధ్యాత్మికతకు మరింత వైభవం జోడించిందని, ఇదంతా ఆ శివుని ఆజ్ఞ అంటూ మేకర్స్ చెప్పడం విశేషం.
Also Read- Phoenix review: ‘ఫీనిక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించిందా..
ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో..
ఈ సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ, పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఉంటుందని, విజువల్‌గా ప్రేక్షకులకు ఫీస్ట్‌లా ఉంటుందని యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆర్‌సి ప్రణవ్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మురళీ శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
