nagavamsi ( image source : x)
ఎంటర్‌టైన్మెంట్

Naga Vamsi: ఆ ఖర్చు నేను కూడా భరించలేను.. నిర్మాత నాగ వంశీ

Naga Vamsi: డాకు మహారాజ్’, ‘మేడ్ స్క్వేర్’ సినిమాతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తన మూడో సినిమా ‘కింగ్డమ్’ తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూలై31న విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ ఇప్పటికే జరుగుతన్నాయి. ఇదే సందర్భంలో ఓ యూ ట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లలో టికెట్ రెటు కన్నా పాప్‌కాన్ రెట్లు ఎక్కువగా ఉన్నాయని దానికి ఆయన కూడా బలయ్యానంటూ చెప్పుకొచ్చారు. రెండు పాప్కాన్లు ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే 1300 రూపాయలు అయిందని ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చారు. అయితే దీని గురించి ఎవరూ ఏం చెయ్యలేరని, దీనిపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసకోవాలని అన్నారు. అందుకు గల కారణాన్ని తెలిపారు. మనకు తెలిసిన వారి చేతులో ఉంటే ఏదైనా చెయ్యవచ్చు మల్టీఫ్లెక్స్ పీవీఆర్ లాంటివి ఇక్కడ తగ్గిస్తే దేశం అంతా తగ్గించాలి అంటారు. అలాంటప్పుడు ప్రభుత్వాలు డైరెక్ట్ గా జీఓ తీసుకువస్తే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్నారు.

Read also- Fish Venkat: ఫిష్ వెంకట్ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం

‘వార్ 2’ గురించి ఆశక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘వార్ 2’ తెలుగులో రాబోతున్న పెద్ద సినిమా.. అందులో నుంచి ఒక పాట కూడా విన్నాను. ఆ పాటలో హ్రుతిక్, ఎన్టీఆర్ లు కలిసి వేసిని స్టెప్పలు అదరగొడతాయి. ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేస్తునపుడు నేను చూశాను. హ్రుతిక్, ఎన్టీఆర్ లకు వేరు వేరు లెగ్ మూమెంట్స్ ఉంటాయి. ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది. చాల కాన్పిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమా కొనడానికి పెద్ద రీజన్ ఏంటి అంటే ఎమోషన్.. తారక్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకు 70శాతం కొన్నాను. మిగిలిన 30 శాతం కాలిక్యులేషన్ చేసుకుని కొన్నాను. తెలుగు ప్రేక్షకులకు తెలుసు ఇది డబ్ మూవీ కాదు తారక్ ఉన్నారు కదా. తారక్ అభిమానులకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. ‘వార్ 2’ ట్రైలర్ వచ్చే వారం రాబోతుందని తెలిపారు.

Read also- Thummala on KTR: కేటీఆర్ పై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తారా అన్న విషయంపై స్పందించారు.. ‘ఇప్పటికి ఆయన మీద ఉన్న బర్డెన్ తీర్చుకుంటున్నారు వరుసగా సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత ఆయన ఇష్టం. అయితే రాబోతున్న ‘కింగ్డమ్’ సినిమా మాత్రం హరి హర వీరమల్లుకు ఏ మాత్రం అడ్డురాదన్నారు. ఈ సినిమా రిలీజై వారం తర్వాత వీరమల్లు తీసేసిన థియేటర్లలో ‘కింగ్డమ్’ రిలీజ్ చేసుకుంటా. ప్రస్తుతం రాబోయో సంక్రాంతి బరిలో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఓ రాజు’ సినిమా ఉంది. ఆ తర్వాత మాత్రం రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాం. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికీ దీనిపై చర్చలు పూర్తయ్యాయి. ఆ తర్వాత రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబోలో కూడా ఓ సినిమా రాబోతుంది. ఈ సనిమా డిష్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సారి ఏదేమైనా వేరే లెవెల్ విజయ్ దేవరకొండను చూడబోతున్నారు.’ అంటూ చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ