Naga Vamsi: పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘వార్ 2’ (War 2) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీని కోసం అటు నార్త్ ఇండియా ప్రేక్షకులు, ఇటు సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగులో అయితే ఇప్పటికే ‘దేవర’తో మంచి జోష్ మీద ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR).. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో యాక్షన్ సీన్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని తెలుగు రైట్స్‌ను ఓ ప్రముఖ నిర్మాత దాదాపు రూ. 80 కోట్లకు సొంతం చేసుకున్నారనే విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read-Warangal: ఇన్స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్.. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం
‘వార్ 2’ సినిమాను తెలుగులో ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ విడుదల చేయనుందని, ‘వార్ 2’ తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. తాను అభిమానించే తారక్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ అన్నారు. ‘‘అరవింద సమేత వీర రాఘవ, దేవర.. సితార బ్యానర్‌పై విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సమయం ఆసన్నమైంది. అభిమానులంతా సిద్ధంగా ఉండండి. ‘వార్ 2’లో మీరు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ను చూడనున్నారు. ఆగస్టు 14న ఉత్సవాలు చేసుకుందాం’’ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తోంది. థ్యాంక్స్ వంశీ అన్నా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read–Fish Venkat Wife on Prabhas: ప్రభాస్ పైసా ఇవ్వలే.. అంతా ఫేక్ న్యూస్.. ఫిష్ వెంకట్ భార్య!
‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 7,500 స్క్రీన్‌లలో ‘వార్ 2’ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఆరో చిత్రమిది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో విజువల్స్ హాలీవుడ్‌ను తలపిస్తున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని టీమ్ కూడా చెబుతోంది. బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు, హృతిక్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
Yes… it’s #War2…Couldn’t be happier to reunite with my dearest @tarak9999 anna ❤️
After #AravindhaSametha and #Devara, it’s time for the hattrick and we are going all in no matter what 💥💥
Dear fans… get ready!
You are going to witness the man of masses like NEVER before….… pic.twitter.com/1ETM7iJVGM— Naga Vamsi (@vamsi84) July 5, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.