Naga Vamsi: ఐబొమ్మ రవి (IBomma Ravi), గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు. ఐబొమ్మ రవికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కొందరు మాట్లాడుతూ.. రకరకాల అభిప్రాయాలు చెప్పారు. అతనికి ఉన్న మైండ్‌ని పోలీసులు యూజ్ చేసుకుంటే బాగుంటుందని శివాజీ వంటి నటుడు కూడా అన్నారు. తాజాగా ఐబొమ్మ రవిపై స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (EPIC First Semester) అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేస్తూ.. సోమవారం హైదరాబాద్‌లో టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు నాగవంశీ సమాధానమిచ్చారు. అందులో..
Also Read- Ustaad Bhagat Singh: ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. సర్‌ప్రైజ్ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
వాడు రాబిన్‌హుడ్ అయిపోయాడు
‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ (90s Middle Class Biopic)లో ఒక మ్యాజిక్ ఉంది. చాలా ఇంప్రెసివ్‌గా ఉండే ఐరా బాగుంది. ఆ మ్యాజిక్ ఇప్పుడు మిస్ అవడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు? బీట్ పీపుల్ లేదంటే డిజటలైజేషన్ అని అనుకుంటున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు నాగవంశీ సమాధానమిచ్చారు. ‘‘అందుకు కారణం సోషల్ మీడియా. ఐబొమ్మ రవిగాడినే రాబిన్‌హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. ఇక మీరు 90స్‌కు, దీనికి ఏం పోలిక చేస్తారు. వాడు రాబిన్‌హుడ్ అయిపోయాడు మాకు. మేము ఒక రూ. 50 టికెట్ రేటు పెంచితే.. తప్పు చేసిన వాళ్లం అయిపోయాము. ఆ అబ్బాయ్ హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పేం జరిగిందని అంటారేంటి? మ్యాజిక్ ఏం మిస్సయింది అంటే.. సోషల్ మీడియానే మాకు’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Also Read- Nov 2025 Hits And Flops: నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో ఏవి హిట్? ఏవి ఫట్?
రొమాంటిక్ కామెడీ కథ
సినిమా గురించి నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అని ఎందుకు టైటిల్ పెట్టామంటే.. ఇది మొదటి భాగం. దీనికి ఇంకా కొనసాగింపు కూడా ఉంటుంది. 90s వెబ్ సిరీస్ చూసి ఆదిత్య హాసన్‌తో ఒక సినిమా చేయాలనుకున్నాము. ఆదిత్య వచ్చి ఈ రొమాంటిక్ కామెడీ కథ చెప్పగానే.. వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. నేను వ్యక్తిగతంగా ఈ తరహా చిత్రాలకు పెద్ద అభిమానిని. ఒక మంచి సినిమా చేశామని తెలిపారు. ‘బేబీ’ వంటి సంచలన విజయం తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘90s’ వెబ్ సిరీస్‌తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
One More Banger Statement by Producer #NagaVamsi at #Epic Glimpse Launch
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 1, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
