Naga Chaitanya In NC24
ఎంటర్‌టైన్మెంట్

Naga Chaitanya: ‘ఎన్‌సీ 24’ లేటెస్ట్ అప్డేట్.. పోస్టర్ అదిరింది

Naga Chaitanya: ‘తండేల్’ (Thandel) సినిమాతో బంపర్ హిట్ అందుకున్న యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) అదే ఊపును కొనసాగిస్తున్నారు. ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య తన NC24 సినిమా చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్‌ని తెలియజేశారు. అదేంటంటే..

ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లుగా తెలుపుతూ ఓ పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు ఏకధాటిగా జరగనుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. మిథికల్ థ్రిల్లర్ జానర్‌ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్‌ అవుతుందని ఇప్పటికే సినీ వర్గాలు ప్రకటించాయి. ఇంతకు ముందు వచ్చిన గ్లింప్స్ కూడా అదే తెలియజేసింది. ఇందులో నాగ చైతన్య ట్రాన్స్ ఫర్మేషన్ సినిమాపై మరింత బజ్‌ను ఏర్పడేలా చేస్తుంది.

Also Read- Hari Hara Veera Mallu Trailer: బెబ్బులి వేట మొదలైంది.. 24 గంటల్లోనే ‘పుష్ప 2’ రికార్డ్ అవుట్!

ఈ రెండో షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌‌లో నాగ చైతన్య కూడా పాల్గొననున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. నాగ చైతన్య లుక్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. నాగ చైతన్య ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్ పట్టుకుని కనిపించాడు. పోస్టర్‌లో ‘One step deeper, one swing closer’ అనే లైన్ ఇంట్రస్టింగ్‌గా వుంది. టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే NC24 – ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్ అనే గ్రిప్పింగ్ కాన్సెప్ట్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా యూనిట్ మరింత ఉత్సాహంతో పని చేస్తోంది.

Also Read- Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలే బాధతో ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు.. వీడియో వైరల్

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు సమర్పణలో BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిర్రాక్ పార్టీ లాంటి సినిమాకు సంగీతాన్ని అందించిన అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. రఘుల్ ధరుమాన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?