Chaitanya Sobhita: సిబ్బందితో కలిసి పండగ చేసుకున్న నాగచైతన్య
naga-chaitnya-photos
ఎంటర్‌టైన్‌మెంట్

Chaitanya Sobhita: సిబ్బందితో కలిసి సంక్రాంతి చేసుకున్న నాగచైతన్య దంపతులు.. ఫోటోలు వైరల్..

Chaitanya Sobhita: పెళ్లయిన తర్వాత వస్తున్న మొదటి పండుగ కావడంతో, అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాళ దంపతులు పండగ సిబ్బందితో కలిసి చేసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంట తమ ఇంటి సిబ్బంది ఆఫీస్ ఉద్యోగులతో కలిసి అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. పండగతో పాటు అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ జంట కొత్తగా కనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో, నాగ చైతన్య శోభిత సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. చైతన్య కుర్తా పైజామాలో కనిపించగా, శోభిత అందమైన పట్టు చీరలో కనిపించారు. తమ ఎదుగుదలలో భాగస్వాములైన సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారితో కలిసి భోజనం చేయడం పండుగ శుభాకాంక్షలు పంచుకోవడం ఈ వేడుక ప్రత్యేకత. ఈ కొత్త జంట తమ సిబ్బంది పట్ల చూపిస్తున్న గౌరవం ప్రేమను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి నిరాడంబరతను చాలా మంది అభినందిస్తున్నారు.

Read also-Theatre Tragedy: మెగాస్టార్ సినిమా చూస్తూ కుప్పకూలిన రిటైర్డ్ ఏఎస్ఐ.. ఏం జరిగిందంటే?

శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో ‘చీకటిలో’ (Cheekatilo)అనే సినిమా జనవరి 23, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కు సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న క్రైమ్ సస్పెన్స్ ఫిల్మ్. సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథలో సంధ్యగా శోభిత ధూళిపాళ్ల నటించారు. ఆమె ఇప్పటికే తెలుగుతో పాటు కొన్ని బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. నటిగానే నాగ చైతన్యకు ఆమె పరిచయమైంది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ పుట్టడం, అది పెళ్లి వరకు వెళ్లడం జరిగింది. లాస్ట్ ఇయర్ వీరిద్దరూ పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాత కూడా శోభిత ధూళిపాళ్ల నటిస్తూనే ఉంది. ఇప్పుడామె నటించిన ఈ ‘చీకటిలో’ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read also-RajaSaab Collections: ప్రభాస్‘ది రాజాసాబ్’ మూడురోజుల గ్రాస్ కలెక్షన్లు ఎంతంటే?..

శోభిత ధూళిపాల నటించిన ‘చీకటిలో’ చిత్రం థియేటర్లలోకి రావడం లేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ తెలుగు సినిమాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 23న ప్రీమియర్ కాబోతున్నట్లుగా ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో సంధ్య పాత్రలో శోభిత ధూళిపాల.. నగరములో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను వెలికితీస్తుంది. అవేంటో తెలియాలంటే మాత్రం జనవరి 23 వరకు వెయిట్ చేయాల్సిందే. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మించారు. చంద్ర పెమ్మరాజు రచనా సహకారం అందించారు. శోభిత ధూళిపాలతో పాటు విశ్వదేవ్ రాచకొండ ఇందులో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. చైతన్య, విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇందులో సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్, తన వద్ద శిక్షణ పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. అతని మృతికి న్యాయం చేయాలని అలుపెరగని ప్రయత్నము చేసే క్రమంలో.. దారుణమైన నేరాల గురించి కనిపెడుతుంది. ఇదే మెయిన్ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని ప్రైమ్ టీమ్ తెలుపుతోంది.

Just In

01

CM Revanth Reddy: త్వరలో ఈ కొత్త రూల్‌.. చలానా పడిందా? మీ ఖాతా నుంచి పైసలు కట్.. సీఎం రేవంత్ రెడ్డి !

Sharwanand: ‘శతమానం భవతి’.. ఆత్రేయపురంలో ‘నారీ నారీ నడుమ మురారి’!

Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!

Kishore Tirumala: ‘బి.ఎమ్.డబ్ల్యూ’లో ఆ ప్రశ్నే ఇంపార్టెంట్.. విడాకులకు కారణమదే!

Kodanda Reddy: నకిలీ విత్తనాలు అరికట్టడంలో.. గత ప్రభుత్వం విఫలమైంది.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు!